Unstoppable with NBK: విజయ్ దేవరకొండకు రష్మిక ఫోన్.. ఇరికించిన బాలయ్య.. ఐలవ్యూ అని చెప్పగానే!

టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోగా హవాను చూపిస్తూ.. ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ జోష్‌లోనే మరిన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు. అదే సమయంలో ఆహా సంస్థ కోసం 'Unstoppable with NBK' అనే టాక్ షోను చేస్తోన్నారు. ఇప్పటికే రెండు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు మరో దానితో వస్తోంది. తాజా సీజన్‌లో కొత్త ఎపిసోడ్‌ కోసం యానిమల్ టీమ్ వచ్చింది. ఇందులో విజయ్ దేవరకొండకు రష్మిక కాల్ చేసింది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

మరో సీజన్‌తో వచ్చిన బాలయ్య:టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'Unstoppable with NBK' విజయవంతంగా రెండు సీజన్లను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే మూడో దాన్ని కూడా ప్రారంభించారు. ఇందులో 'భగవంత్ కేసరి' టీమ్ సందడి చేసింది. ఈ ఎపిసోడ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా మూడో సీజన్ గ్రాండ్‌గా మొదలైనట్లైంది.

Ranbir Kapoor and Rashmika Mandanna Unstoppable with NBK 3 Promo Released

యానిమల్ టీమ్‌తో మరొకటి:'Unstoppable with NBK' మూడో సీజన్‌లో భాగంగా షోలో 2వ ఎపిసోడ్‌లో పాల్గొనేందుకు గానూ 'యానిమల్' మూవీ టీమ్ వచ్చింది. తాజాగా ఈ ప్రోమోను విడుదల చేశారు. ముందుగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను.. ఆ తర్వాత హీరో రణ్‌బీర్ కపూర్‌కు అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చి మరీ బాలయ్య ఆహ్వానించారు. తర్వాత రష్మిక మందన్నానూ తనదైన శైలిలో పిలిచారు.

ఫ్లూటు జింక ముందు ఊదు:తాజాగా వచ్చిన ప్రోమోలో వైల్డుగా స్టేజ్‌ మీదకు వచ్చిన రణ్‌బీర్ కపూర్.. 'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు' అని బాలయ్య డైలాగ్ చెప్పి అలరించాడు. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి ఓ హిందీ పాటకు డ్యాన్స్ కూడా చేశారు. కాసేపటి తర్వాత రణ్‌బీర్ కపూర్.. బాలకృష్ణ ఇంగ్లీష్ డైలాగును కూడా చెప్పాడు. అనంతరం 'పైసా వసూల్' పాటకు డ్యాన్స్ చేశారు.

Ranbir Kapoor and Rashmika Mandanna Unstoppable with NBK 3 Promo Released

సుకుమార్ ఒప్పుకున్నాడా:రష్మిక స్టేజ్ మీదకు వచ్చిన వెంటనే బాలయ్య డ్యాన్స్ చేసి 'నీతో మెలికలు తిరుగుతుంటే నా గుండె కూడా మెలికలు తిరుగుతోంది' అన్నారు. అనంతరం ఆమె ఏ సినిమాలు చేస్తుందని అడిగారు. అప్పుడు రష్మిక లిస్టు చెప్పగా.. 'సుకుమార్ ఇవన్నీ చేయడానికి ఒప్పుకున్నాడా' అని బాలయ్య ప్రశ్నించారు. అప్పుడామె 'సుక్కూ సార్‌కు తెలుసు' అని వివరణ ఇచ్చింది.

ఇద్దరిలో ఎవరు బాగున్నారు:'Unstoppable with NBK' షోలో భాగంగా విజయ్ దేవరకొండతో పాటు తన ఫొటోను చూపించిన వెంటనే రణ్‌బీర్ కపూర్ 'సార్.. ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని రష్మికను అడగండి' అని బాలయ్యతో అన్నాడు. అప్పుడాయన 'రష్మిక ఈ ఇద్దరిలో ఎవరు బాగున్నారు చెప్పు' అని అడిగి ఇరికించేశారు. అప్పుడు రష్మిక మాత్రం సమాధానం చెప్పలేక సిగ్గుపడిపోయింది.

విజయ్ దేవరకొండకు ఫోన్:'Unstoppable with NBK' షోలో భాగంగా హోస్ట్ నందమూరి బాలకృష్ణ అడగడంతో రష్మిక మందన్నా.. తన క్లోజ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండకు ఫోన్ కాల్ చేసింది. అప్పుడతను 'వాట్సప్‌రే' అని అనగానే రష్మిక సిగ్గు పడిపోయింది. అంతలోనే బాలయ్య కలుగజేసుకుని 'ఈ మేడ మీద పార్టీలు ఏంటన్నా' అంటూ విజయ్‌ను ప్రశ్నించడంతో అంతా నవ్వుకున్నారు.

రష్మికకు ఐలవ్యూ చెప్పేసి:ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో విజయ్ దేవరకొండ మాట్లాడుతుండగా బాలయ్య వెళ్లి 'మీ హీరోకు చెప్పమ్మా.. ఐలవ్ రష్మిక' అన్నారు. దీంతో ఆమె సిగ్గుపడగా.. అందరూ నవ్వుకున్నారు. ఆ తర్వాత రణ్‌బీర్‌ను 'నువ్వు ఆలియాది కాకుండా ఎవరి సోషల్ మీడియా అకౌంట్ తరచూ చూస్తావు' అని ప్రశ్నించారు. ఇలా ఈ ప్రోమో సాగింది. దీంతో ఎపిసోడ్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. అన్నట్లు ఈ ఎపిసోడ్ నవంబర్ 24న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X