Balakrishna: అది సార్ బాలయ్య రేంజ్.. బాలీవుడ్ హీరోలు సైతం ఫిదా అవ్వాల్సిందే!

బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా... ఆయన ఆరు పదుల వయసులోనూ పెద్ద హీరోలకే కాదు.. కుర్ర హీరోలకు కూడా గట్టిపోటీనిస్తూ.. ఫుల్ జోష్ మీద ఉన్నారు. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ.. అది బాలయ్య రేంజ్ అని నిరూపించుకుంటున్నారు. అయితే బాలయ్య కోసం బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు వస్తున్నారు. వచ్చి బాలయ్యతో సందడి చేయనున్నారు. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఒకప్పుడు టాలీవుడ్ అంటే చాలా మందికి తెలియదు. ఇక రాజమౌళి పుణ్యమా అని... ఇండియానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇక ఆ మధ్య సుమ క్యాష్ షోలో బ్రహ్మస్త్ర టీమ్ వచ్చి సందడి చేసింది గుర్తే ఉంటుంది కదా. రాజమౌళి, అలియా భట్, రణ్ బీర్ కపూర్ వచ్చారు. మొదటి సారిగా తెలుగు షోలో బాలీవుడ్ హీరో, హీరోయిన్స్ రావడం. అలా రికార్డు సృష్టించింది సుమ. ఇక ఇప్పుడు బాలయ్య షోకి కూడా బాలీవుడ్ హీరో, హీరోయిన్స్ రాబోతున్నారు.

Ranbir Kapoor Rashmika Mandanna and Sandeep Vanga To Arrive As Guests For NBK Unstoppable Show

బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షో లిమిటిట్ ఎడిషన్ ఇటీవ‌ల మొద‌లైన సంగతి తెలిసిందే. లిమిటెడ్ ఎడిష‌న్ పేరుతో స్పెషల్ ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇక భగవంత్ కేసరి రిలీజ్ టైమ్ లో భగవంత్ కేసరి టీమ్ వచ్చి సందడి చేసింది. అనిల్ రావిపూడి, శ్రీలీల.. భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో భాగంగా... బాలయ్య అన్ స్టాపబుల్ షోలో సందడి చేశారు. ఇక బాలయ్య కూడా వారితో కలిసి ముచ్చటించారు. ఇక ఆ ఎపిసోడ్ కు మంచి ఆదరణ కూడా వచ్చింది.

ఇక ఇప్పుడు బాలయ్య అన్ స్టాపబుల్ షోకు యానిమల్ టీమ్ రాబోతుంది. గెస్టులుగా బాలీవుడ్ హీరో ర‌ణ్ బీర్‌ క‌పూర్, హీరోయిన్ రష్మిక మందన్నా, దర్శకుడు సందీప్ వంగా రెడ్డి రానున్నారు. ఈ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. యానిమ‌ల్ మూవీ తెలుగు ప్ర‌మోష‌న్స్‌ లో భాగంగా వారు అన్‌స్టాప‌బుల్‌ షోకు గెస్టులుగా హాజరుకాబోతున్నారు. ఇక త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది.

Ranbir Kapoor Rashmika Mandanna and Sandeep Vanga To Arrive As Guests For NBK Unstoppable Show

అన్ స్టాపబుల్ షోకు బాలీవుడ్ హీరోలు సైతం రావడం.. ఇదే మొదటి సారి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఇది కదా సార్ బాలయ్య రేంజ్ అంటున్నారు. ఇక ఈ షో.. నవంబర్ లాస్ట్ వీక్ లో ప్రసారం కానుందని తెలుస్తుంది. ఇక డిసెంబర్ 1న యానిమల్ మూవీ తెలుగు, తమిళ్, కన్నడ, హీందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీకి అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ చేయడంతో.. అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. తండ్రీ కొడుకుల అనుబంధం నేప‌థ్యంలో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ గా తెరకెక్కింది. ఇందులో రణబీర్ తండ్రిగా అనిల్ కపూర్ నటించాడు. బాలీవుడ్ సీనియ‌ర్ హీరో బాబీ డియోల్ విల‌న్‌ గా నటించగా... దాదాపు 100 కోట్ల బ‌డ్జెట్‌తో టీ సిరీస్ సంస్థ‌తో క‌లిసి సందీప్ వంగా యానిమ‌ల్ మూవీని నిర్మించాడు. ఇక ఈ మూవీలోని ముద్దు సీన్స్ చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X