Animal OTT: అనుకున్న తేదీ కంటే ముందుగానే ఓటీటీలోకి యానిమల్.. ఎక్కడ చూడాలంటే?
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోహీరోయిన్లు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన సినిమా యానిమల్. ఈ సినిమా గురించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ అంచనాల మధ్య విడుదలే.. బాక్సాఫీసు షేక్ చేసిన ఈ చిత్రం అనేక రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ మంచి గుర్తింపు వచ్చింది. అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అద్భుతమైన యాక్షన్ సన్నివేషాలను ఇలా కూడా తీయచ్చంటూ చెప్పి విపరీతమైన మన్ననలు పొందుతున్నారు.
తెలుగుతో పాటు అనేక భాషలకు సినీ రంగాలకు చెందిన ప్రముఖులు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ ను ఇష్టపడుతున్నారు. అయితే టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు ఈ చిత్రాన్ని నిర్మించగా.. విపరీతమైన లాభాలు పొందారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో డిసెంబర్ ఒకటవ తేదీన విడుదల అయిన చిత్రం 1000 కోట్ల వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ చాలా చోట్ల ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది.

అయితే ఇప్పటికీ థియేటర్లలో నడుస్తున్న ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా భారీ ధరకు కొనుగోలు చేసిందని కూడా టాక్ నడిస్తోంది. అయితే ఇప్పటికే ఈ చిత్రాన్ని ఓటీటీ వేధికగా జనవరి 26వ తేదీన విడుదల చేయబోతున్నారటి అంతా అనుకున్నారు. కానీ అనుకున్న తేదీ కంటే ముందుగానే ఈ సినిమాను ఓటీటీల్లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నారట. ముఖ్యంగా సెలవు దినాల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ చేస్తే బాగుంటుందని భావించారట.
ఈక్రమంలోనే జవవరి 15వ తేదీన యానిమల్ సినిమా నెట్ ఫ్లిక్స్ వేధికగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించి ఇప్పటికీ ఎలాంటి అదికారిక ప్రకటన రాలేదు. కానీ కచ్చితంగా జనవరి 15వ తేదీ నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుందని తెలుస్తోంది. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వనున్నారట. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

మరోవైపు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోయే ఈ సినిమా రన్ టైమ్ పై కూడా చాలానే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సెన్సార్ బోర్డు ఫిక్స్ చేసిన రన్ టైమ్ తోనే ఈ చిత్రాన్ని ఓటీటీ వేధికాగ స్ట్రీమింగ్ చేస్తారా లేక డిలీట్ చేసిన కొన్ని సీన్లను కూడా యాడ్ చేసి చూపిస్తారా అనే దానిపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. అదనపు సన్నివేషాలతో కలుపుకుని అయితే 3.49 నిమిషాల నిడివి ఉన్న సినిమాను చూడొచ్చు. లేదంటే థియేటర్లలో చూసిన 3.21 నిమిషాల నిడివి ఉన్న చిత్రాన్ని మాత్రమే చూడొచ్చు. మరికొన్ని రోజుల్లో దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











