Animal OTT: ఆ ఓటీటీలోకి రణబీర్ కపూర్ యానిమల్ మూవీ.. ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందంటే?
బాలీవుడ్ ది మోస్ట్ ఏవైటెడ్ మూవీ యానిమల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. డిసెంబర్ 1న ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ పార్టనర్ ను రివిల్ చేశారు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అయితే థియేటర్ వర్షన్ కాకుండా ఓటీటీలో డిఫరెంట్ వర్షన్ రిలీజ్ కానుంది. అయితే ఓటీటీలో ఎప్పుడు, ఎంత టైమ్ తో రిలీజ్ కానుందో ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం యానిమల్. ఇక ఈ మూవీ ఎట్టకేలకు డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హీంది భాషల్లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన మొదటి షో నుంచి ఈ సినిమాకు మంచి టాక్ వస్తుంది. సినిమా సందీప్ రెడ్డి వంగా మార్క్ లో వైయిలెంట్ గా ఉందని చెబుతున్నారు.

ఇక ఈ సినిమాలో బల్బీర్ సింగ్ గా అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక గీతాంజలిగా రష్మిక నటిస్తుండగా... బాబీ డియోల్, సీనియర్ నటుడు పృథ్వీ రాజ్ విలన్ రోల్స్ లో నటిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్‌కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రణబీర్ కపూర్ కెరియర్ లో ది బెస్ట్ ఓపెనింగ్స్ వస్తాయని అంటున్నారు.
ఇక ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసుకుంది. తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో శుక్రవారం ఈ యాక్షన్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. యానిమల్ పై ఉన్న హైప్ కారణంగా ఈ మూవీ ఈజీగానే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తొలిరోజు తెలుగులో మానిమల్ ఐదు కోట్ల వరకు వసూళ్లు రాబట్టనుందని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ మూవీ తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులను దిల్‌రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా ఓటీటీ వివరాలు బయటకు వచ్చాయి. ఈ సినిమా రిలీజ్ కు ముందే భారీ అంచనాలను నెలకోల్పింది. దీనికి కారణం సందీప్ రెడ్డి సినిమా, రిలీజ్ అయిన ట్రైలర్స్, పాటలు మంచి హైప్ ను తీసుకువచ్చాయి. ఇక ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుందని సమాచారం. నెట్ ఫ్లిక్స్ లోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఈ యానిమల్ మూవీ థియేటర్ కు వచ్చిన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఇది డిసెంబర్ 1, 2023న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయింది. కాబట్టి... జనవరి 26 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమా థియేటర్ వర్షన్ కాకుండా ఓటీటీలో మరింత రన్ టైం తో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.
యానిమల్ ట్రైలర్ ఈ రోజు విడుదల కానుంది. అలాగే యానిమల్ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ యానిమల్ డిజిటల్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుందని తెలుస్తోంది. అలాగే యానిమల్ హిందీ రైట్స్ ను సోనీ సంస్థ సొంతం చేసుకుందని తెలుస్తోంది. తాజాగా యానిమల్ కు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ బోర్డు మెంబర్స్. మరి సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











