27 ఏళ్ల వయసులోనే యంగ్ హీరోయిన్‌ను తల్లిని చేసిన డైరెక్టర్.. యువ తార షాకింగ్ రియాక్షన్!
ఇండియన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో అత్యధిక రేటింగ్ ఉన్న రియాలిటీ షోలో కాఫీ విత్ కరణ్. ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్ హోస్ట్‌గా రూపొందించే ఈ టాక్ షోకు విశేషంగా ఆదరణ ఉంది. ఇటీవల ప్రారంభమైన సీజన్ 8కు మంచి రెస్పాన్స్ కనిపిస్తున్నది. ఈ షోలో అతిథులుగా స్టార్ హీరోయిన్లు కాజోల్, రాణి ముఖర్జీ హాజరయ్యారు. వారిద్దరితో కరణ్ జోహర్ ఉల్లాసంగా, ఉత్సాహంగా టాక్ షోను నడిపారు. ఈ షోలో రాణి ముఖర్జీ మాట్లాడుతూ..
దర్శకుడు కరణ్ జోహర్‌తో రాణి ముఖర్జీకి, కాజోల్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇద్దరు హీరోయిన్లను తన తొలి సినిమా కుచ్ కుచ్ హోతా హై ద్వారా పరిచయం చేశారు. షారుక్ ఖాన్ పక్కన నటించిన ఈ ఇద్దరికి స్టార్ హీరోయిన్ స్టేటస్ ఈ సినిమాతోనే వచ్చింది. ఈ ఇద్దరు కూడా ఆ తర్వాత బిజీ అయిపోయారు.

అయితే తాజాగా కాఫీ విత్ కరణ్ సీజన్ 8 టాక్ షోలో 1998 సంవత్సరంలో రిలీజైన కుచ్ కుచ్ హోతా హై సినిమా గురించి మాట్లాడుకొన్నారు. ఆ సినిమా గురించి కాజోల్, రాణి ముఖర్జీ మాట్లాడుకొంటూ.. గొప్ప అనుభూతికి లోనయ్యారు. ఆ సినిమాలో నటించేటప్పుడు తన వయసు 27 సంవత్సరాలు. ఇంకా పూర్తిగా నా కెరీర్ ఊపందుకోలేదు. అలాంటి సమయంలో కరణ్ వచ్చి తల్లి పాత్ర చేయాలని అన్నాడు అని రాణి ముఖర్జీ తెలిపింది.

కుచ్ కుచ్ హోతా హై సినిమాలో ఒక బిడ్డకు తల్లిగా నటించాలనప్పుడు నాకు అనేక రకాల అభ్యంతరాలు మనసులోకి వచ్చాయి. ఇంత చిన్న వయసులో తల్లిగా నటిస్తే నా కెరీర్ ఏమైపోతుంది. ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుంది. నాకు మళ్లీ హీరోయిన్ ఆఫర్లు వస్తాయా? నన్ను తల్లి పాత్రలే చేయమంటారా? అనే ప్రశ్నలు కంగారుపెట్టాయని రాణి ముఖర్జీ చెప్పారు.
అయితే కుచ్ కుచ్ హోతా హై సినిమా రిలీజైన తర్వాత నా పాత్రకు మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత నాకు భారీ ఆఫర్లు కూడా రావడంతో అలాంటి ఆందోళన తగ్గింది. కానీ సినిమా చేసేటప్పుడు నాకు రకరకాలు ఆలోచనలు టెన్షన్ పెట్టాయి అని రాణిముఖర్జీ అన్నారు.

రాణి ముఖర్జీ మాటల విన్న తర్వాత కరణ్ జోహర్ మాట్లాడుతూ.. నాకు అలాంటి సందేహాలు ఉండేవి. కానీ షారుక్ కూడా యంగ్‌గా ఉన్నప్పుడు అదే సినిమాలో తండ్రిగా నటించారు కదా.. తల్లిగా, తండ్రిగా నటిస్తే అలాంటి పాత్రలు వస్తాయనుకోవడం తప్పు. కానీ కొన్నిసార్లు ఇండస్ట్రీలోని వారు కొంతమందికి అలాంటి పాత్రలే ఇవ్వాలని ముద్ర వేసిన దాఖలాలు ఉన్నాయనే విషయాన్ని కరణ్ జోహర్ ప్రస్తావించారు.


Click it and Unblock the Notifications











