ఇకపై వాక్యూమ్ క్లీనర్‌‌‌ని చూస్తే వణుకే , ఓటీటీలోకి మర్డర్ మిస్టరీ మూవీ.. ఎందులో,ఎప్పుడు?

సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ మూవీస్ తీయడంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమకి ప్రత్యేక గుర్తింపు ఉంది. భారత్‌లోని అన్ని భాషల్లోనూ ఈ జోనర్స్‌లో సినిమాలు వచ్చినా మలయాళీల టేకింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఓటీటీలు అందుబాటులోకి రావడంతో మలయాళ సినిమాలు బాగా పాపులర్ అయ్యాయి. చాలా తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీసి భారీ వసూళ్లను అందుకోవడం వీరి టాలెంట్. తాజాగా మలయాళంలో తెరకెక్కిన ఓ మర్డర్ మిస్టరీ మూవీ దక్షిణాది భాషల్లో ఓటీటీలలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..

రంజిత్ సంజీవ్, దిలీశ్ పోతన్ కీలకపాత్రలు పోషించిన గోలం మూవీ ఈ ఏడాది జూన్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంజాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సన్నీ వైన్, అలెన్సియర్ లే లోపేజ్, సిద్ధిఖీ, చిన్నూ చాందినీ, శ్రీకాంత్ మురళి, అన్సల్ పల్లరుతీ తదితరులు కీలకపాత్ర పోషించారు. ఫ్రాగ్రెంట్ నేచర్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్‌పై అన్నే సంజీవ్, సంజీవ్ పీకే నిర్మాతగా వ్యవహరించారు. విడుదలైన తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న గోలం .. లాంగ్ రన్‌లో మంచి వసూళ్లను దక్కించుకుంది.

Ranjith Sajeev and Dileesh Pothan starrer Golam ott release confirmed here s the details

అసలు గోలం కథ, కథనంలోకి వెళితే.. వీటెక్ అనే కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఇసాక్ జాన్ (దిలీశ్ పోతన్) అనుమానాస్పద స్థితిలో శవమై కనిపిస్తాడు. అతని డెడ్ బాడీ ఉన్న గదికి లోపలి నుంచి లాక్ చేసి ఉండటంతో ప్రమాదవశాత్తూ కిందపడి తలకు గాయమై చనిపోయి ఉండొచ్చని పోలీసులు , జనం భావిస్తారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు తీసుకున్న ఏఎస్‌పీ సందీప్ (రంజిత్ సంజీవ్) ఇది ప్రమాదం కాదని హత్య అని అనుమానిస్తాడు. తనదైన కోణంలో పరిశోధిస్తాడు. సందీప్ అనుమానించినట్లుగానే ఇసాక్‌ జాన్‌ది హత్యేనా? అతనిని ఎవరు చంపారు? అతని హత్యకు దారి తీసిన కారణాలేంటీ? ఇన్వెస్టిగేషన్‌లో సందీప్ ఎదుర్కొన్న సమస్యలేంటీ? అన్నదే గోలం మూవీ కథ.

గ్రిప్పింగ్ నేరేషన్‌తో , ఊహకందని ట్విస్టులతో గోలం మూవీని అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్ సంజాద్. ఈ సినిమా చూశాక వాక్యూమ్ క్లీనర్లు, ఆఫీస్‌లో వాడే బయో మెట్రిక్స్ వాడేందుకు కూడా ఆలోచించేలా భయపెట్టాడు సంజాద్. థియేటర్‌లో మంచి ఆదరణ దక్కించుకున్న ఈ సినిమాను తొలుత ఆగస్టులో అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ చేశారు. అయితే అప్పుడు కేవలం మలయాళంలో మాత్రమే అందుబాటులో ఉంచారు. ఓటీటీలోనూ మంచి వ్యూస్ సాధించిన గోలం మూవీని ఇప్పుడు మిగిలిన దక్షిణాది సహా మొత్తం నాలుగు భాషల్లోనూ రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు.

దీనిలో భాగంగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో గోలం సినిమాను అందుబాటులో ఉంచారు. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది. మరి ఈ నాలుగు భాషల్లో గోలం ఏ స్థాయిలో వ్యూస్ దక్కించుకుంటుందో వేచి చూడాలి. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ తరహా సినిమాలను ఇష్టపడే వారిని ఈ గోలం మూవీ బాగా ఆకట్టుకుంటుందని అంటున్నారు.

More from Filmibeat

Read more about: golam ott news amazon prime video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X