OTTలోకి వచ్చేసిన సూపర్ హిట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. చూడాలంటే ఓ కండిషన్!
బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, అలియా భట్ నటించిన చిత్రం రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ. చాలా ఏళ్ల తర్వాత దర్శకుడు కరణ్ జోహర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా జులై 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద 300కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే....
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, అలియాభట్ కలిసి నటించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ. ఇక ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కరణ్ జోహర్ తెరకెక్కించారు. ఆయన చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇక ఈ మూవీ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా థియేటర్లోకి వచ్చింది. ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో ప్రపంచ వ్యాప్తంగా రూ.315 కోట్ల మేర వసూళ్లు సాధించిందని తెలుస్తోంది.

అయితే...రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండా... సైలెంటుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడీ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ ఈ సినిమా చూడాలంటే ఓ కండిషన్ పెట్టారు. ఈ సినిమాను అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంచారు. ఇక ఈ చిత్రాన్ని వీక్షించాలంటే రూ.349 చెల్లించాల్సి ఉంటుంది. మరి ఇంత చెల్లించి చూడాలంటే.. ఓటీటీ ప్రేక్షకులకు కాస్త నిరాశే. అయితే ఫ్రీ గా చూడాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందేనని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే... ఢీల్లీలో స్వీట్స్ వ్యాపారం చేసే పంజాబీ కుటుంబానికి చెందిన వారసుడు రాకీ రాంధ్వా. ఆయనే రణవీర్ సింగ్. ఇక అతడికి కన్వల్ (ధర్మేంద్ర), ధనలక్ష్మి (జయబచ్చన్) అనే తాత, అమ్మమ్మలు ఉంటారు. కన్వల్.. తన స్నేహితురాలు జామిని ఛటర్జీ (షబానా అజ్మీ) అనే మహిళను కలవాలని అనుకుంటాడు. వాళ్లిద్దరినీ కలిపేందుకు రాకీ రంగంలోకి దిగుతాడు.

ఈ క్రమంలోనే అతడు జామిని మనవరాలు రాణీతో ప్రేమలో పడతాడు. ఆమె అలియాభట్. రాకీ - రాణీ ప్రేమకు ఇరు కుటుంబాలు అభ్యంతరం వ్యక్తం చేస్తాయి. మరి, వీరి ప్రేమ కథ విజయం అందుకుందా? ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపేందుకు రాణీ ఏం చేసింది? కన్వల్ - ధనలక్ష్మి - జామిని ఛటర్జీ కథ ఏమిటి? అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇక ఆ మధ్య ఓ ఝమ్కా అనే పాట తెగ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. ఆ పాట ఈ సినిమాలోనిదే.


Click it and Unblock the Notifications











