Koffee With Karan 8 దీపికతో గాఢంగా లిప్‌లాక్.. నా ఫ్రెండ్ ఇటుకతో కొట్టినా తన్మయత్వంతో అలాగే.. రణ్‌వీర్‌సింగ్
దర్శక, నిర్మాత కరణ్ జోహర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ 8 షో ఓటీటీ ద్వారా ప్రేక్షకలు ముందుకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీలో అక్టోబర్ 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ షోలోకి తొలి జంటగా బాలీవుడ్‌లో అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన జంట దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ తమ అఫైర్ గురించిన విషయాలు వెల్లడించారు. కరణ్‌తో దీపిక చెప్పిన విషయాలు ఏమిటంటే?
రామ్ లీలా మూవీ షూటింగ్‌లో: సంజయ్ లీలా భన్సాలీ మూవీ రామ్ లీలా సెట్‌లో ఫస్ట్ టైమ్ కలిసిన తర్వాత రోజు నుంచే నేను, దీపిక డేటింగ్ చేయడం ప్రారంభించాం. రామ్ లీలా షూటింగ్ ప్రారంభమైన తర్వాత నా సీన్లు షూట్ లేకపోయినా నేను దీపిక కోసం సెట్‌కు రోజు వెళ్తుండే వాడిని. రామ్ లీలా సినిమా స్టార్టింగ్‌కు ముందే నేను ఆమెను ఫాలో అవ్వడం మొదలుపెట్టాను అని రణ్‌వీర్ చెప్పారు.

ప్రైవేట్‌గా వెకేషన్స్‌కు: రామ్ లీలాతో ప్రారంభమైన మా రిలేషన్‌షిప్ చాలా ఏళ్లుగా సాగింది. మేమిద్దరం ప్రైవేట్‌గా వెకేషన్స్‌కు వెళ్లేవాళ్లం. కొన్నేళ్లు న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకొన్నాం. అయితే నా జీవిత భాగస్వామి దీపిక మాత్రమే అనే విషయం పదే పదే నా మనసు గుర్తు చేసేది. నేను ఎవరిని కలిసినా.. దీపికపైనే మనసు ఉండేది. నాపై నాకు పూర్తి నమ్మకం ఉండేది అని రణ్‌వీర్ సింగ్ చెప్పారు.
2012 నుంచి డేటింగ్: మేమిద్దరం 2012 నుంచి డేటింగ్ చేస్తున్నాం. 2015లో సీక్రెట్‌గా ప్రపోజ్ చేశాను. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. రామ్ లీలా సినిమాలో రోమియో, జూలియట్ పాత్రల్లో నటిస్తుండటంతో మా మధ్య కెమిస్ట్రీ బలపడింది. మా నుంచి భన్సాలీ కూడా అదే ఆశించారు. మేమిద్దరం కలిసి షూటింగ్‌కు వెళ్లే వాళ్లం. షూటింగ్ నుంచి కూడా ఇంటికి కలిసే వెళ్లే వాళ్లం అని రణ్‌వీర్ సింగ్ చెప్పారు.

రామ్ లీలాలో ముద్దు సీన్: రామ్ లీలా షూటింగులో ఓ లిప్ లాక్ సీన్ ఉండేది. నేను దీపిక గదిలోకి వెళ్లి ముద్దు పెట్టుకోవాలి. ఆ సమయంలో ఎవరో వస్తున్నారనే హింట్ ఇస్తూ నా స్నేహితుడు ఇటుకతో కొట్టాలి. అయితే మేమిద్దరం లిప్‌లాక్ పెట్టుకొన్నాం. నా ఫ్రెండ్ క్యారెక్టర్ ఇటుకతో వీపులో కొట్టాడు. అయితే ఆ ఇటుక బలంగా తాకిందనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా గాఢంగా లిప్‌లాక్‌లో మునిగిపోయాం అని రణ్‌వీర్ సింగ్ చెప్పాడు. అంతగా మేము సీన్‌లోనే కాకుండా నిజంగా తన్మయత్వంలో మునిగిపోయాం అని చెప్పాడు.
దీపికను అడ్వాన్స్ బుకింగ్ చేసుకొన్నా: రామ్ లీలా సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత దీపికను తప్ప మరొకరిని నా జీవితంలో ఊహించుకోలేననే ఫీలింగ్ కలిగింది. అందుకే ఆమె జీవితంలోకి ఎవరూ రాకుండా నేను ముందుగా రిజర్వు (ఆమె సీట్‌లో చెప్పులు పెట్టాలని) చేసుకోవాలని అనుకొన్నాను. చెప్పులు పెట్టడమంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలని అనుకొన్నాడు అని దీపిక పదుకోన్ వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











