OTT Movie: ఓటీటీలోకి యానిమల్ బ్యూటీ బోల్డ్ మూవీ, తెలుగు కామెడీ ఎంటర్ టైనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Movie: ఈ మధ్యకాలంలో థియేటర్లలో సినిమాలు చూడటం కంటే ఓటీటీలోనే ఎక్కువ సినిమాలు చూసే పరిస్థితి నెలకొంది. పెద్ద హీరో మూవీస్, భారీ బడ్జెట్ సినిమాలు సంగతి పక్కన పెడితే.. తక్కువ, అవరేజ్ బడ్జెట్ సినిమాలు ఓటీటీలోకి విడుదలవుతున్నాయి. అటు విడుదల అవుతున్నా లేదో.. పది లేదా 15 రోజుల్లో ఓటీటీల్లో ప్రత్యేక్షం అవుతున్నాయి. ఇలా రావడంతో ఓటీటీ ప్రియులు పండగ చేసుకుంటున్నారు. పైగా ఇది వర్షాకాలం వర్షాలు దంచి కొడుతుండటం తో జనాలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడదు. దీంతో నచ్చిన సినిమాను ఫోన్ లోనో, టీవీలోనో చూస్తు ఎంజాయ్ చేస్తారు. ఇటీవలే థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఓ సూపర్ హిట్ సినిమా ఓటీటీలో ప్రత్యేక్ష కానున్నది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ? ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానున్నది. మీరు కూడా ఓ లూక్కేయండి.

ఓటీటీలో ప్రత్యేకమయ్యే మూవీ ఏదో కాదు. అదే సీనియర్ యాక్టర్ రావు రమేష్‌ ప్రధాన పాత్రలో నటించిన మూవీ మారుతీనగర్‌ సుబ్రహ్మణ్యం. డైరెక్టర్ లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ మూవీకి సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత సుకుమార్ సమర్పకురాలు వ్యవహరించారు. ఈ సినిమాలో ఇంద్రజ, అంకిత్, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్‌, అజయ్, అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రల్లో నటించారు. విడుదలకు ముందే ఈ మూవీ భారీ హైప్ ను క్రియేట్ చేసింది. ప్రమోషన్ ఈవెంట్లలో డైరెక్టర్ సుకుమార్, స్టార్ హీరో అల్లు అర్జున్ పాల్గొనడంతో ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి.

Rao Ramesh Maruti nagar Subrahmanyam and Bad News will be released on OTT streaming platforms

ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఆగస్టు 23న విడుదలైన ఈ మూవీ మారుతి నగర్ సుబ్రమణ్యం ప్రేక్షకులు పుల్ ఎంటర్టైన్ మెంట్ అందించింది. థియేటర్ వచ్చిన ప్రతి ప్రేక్షకుడు కచ్చితంగా నవ్వాల్సిందే. అంతలా ఎంటర్టైన్ మెంట్ అందించింది. ఈ మూవీలో రావు రమేశ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇలా నవ్వించిన మారుతీ నగర్ సుబ్రమణ్యం మూవీ త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. త్వరలోనే మారుతీనగర్ సుబ్రమణ్యం ఓటీటీలోకి పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. కానీ, అధికారికంగా స్ట్రీమింగ్ డేట్ ప్రకటించ లేదు. కానీ, సెప్టెంబర్ 20 నుంచి ఓటీటీలో ప్రత్యేక్షం కావొచ్చనే టాక్ నడుస్తుంది.

ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్యాడ్ న్యూస్

యానిమల్ మూవీ ఫేమ్ తృప్తి డిమ్రి నటించిన మూవీ బ్యాడ్ న్యూస్. హాట్ అండ్ బోల్డ్ గా తెరకెక్కిన ఈ మూవీ త్వరలో అమెజాన్ ప్రైమ్ లోకి రానున్నది. ఒక బిడ్డకు ఇద్దరు తండ్రులంటూ ఓ సెన్సిటీవ్ మ్యాటర్ ను చాలా బోల్డ్ గా తెరకెక్కించారు. ఈ మూవీలో విక్కీ కౌశల్, తృప్తి డిమ్రి, ఆమీ విర్క్ ప్రధాన పాత్రలలో నటించారు. జులై 19న థియేటర్లలో విడుదల ఈ మూవీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో సలోని బగ్గా అనే చెఫ్ పాత్రలో తృప్తి నటించింది.

Rao Ramesh Maruti nagar Subrahmanyam and Bad News will be released on OTT streaming platforms

బ్యాడ్ న్యూస్ మూవీని రూ.80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. ఏకంగా రూ.115.74 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ డేనే రూ.8.3 కోట్లతో వసూలు చేసి.. ఫస్ట్ వీకెండ్ వరకు రూ.44.1 కోట్లు వసూలు చేసింది. ఇలా ఈ ఏడాది హిందీ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన ఏడో మూవీగా నిలిచింది బ్యాడ్ మూవీ. ఈ మూవీ సెప్టెంబర్ 13 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X