Chhaava OTT : ఓటీటీలోకి ‘ఛావా’.. 800 కోట్లు రాబట్టిన సెన్సేషనల్ మూవీని ఎక్కడ చూడాలంటే?
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న 'పుష్ప2'తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత హిందీలో 'ఛావా' చిత్రంతో మరో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ కొడుకు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం 2025 ఫిబ్రవరి 14న కేవలం హిందీలోనే గ్రాండ్ గా విడుదలైంది. బాలీవుడ్ స్టార్ హీరో, కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌషల్ ఈ చిత్రంలో శంభాజీ పాత్రను పోషించారు. రష్మిక మందన్న శంభాజీ భార్య యేసుబాయ్ బోన్ల్సే పాత్రలో నటించి మెప్పించింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఈ చిత్రంతో విక్కీ కౌషల్ నట విశ్వరూపాన్ని చూపించారు. ఆయన కెరీర్ లో ఇది చెప్పుకోదగిన చిత్రంగా మిగిలిపోయింది. శంభాజీ పాత్రకు సరిగ్గా సరిపోవడమే కాకుండా.. యాక్షన్ సీన్లలోనూ దుమ్ములేపాడు విక్కీ కౌషల్. మరోవైపు రష్మిక మందన్న కూడా తన పాత్రకు ప్రాణం పోసింది. ఇలా ఇద్దరూ కలిసి మొఘల్ కాలాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. అయితే ఈ చిత్రానికి నార్త్ లోని ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. అంతే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఈ చిత్రం 13వ హ్యాయేస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ గా రికార్డు క్రియేట్ చేసింది. మరోవైపు హ్యయేస్ట్ గ్రాస్ వసూల్ చేసిన 8వ హిందీ చిత్రంగానూ రికార్డు నెలకొల్పింది.

ఇలా ఛావా చిత్రానికి చాలానే విశేషాలు దక్కాయి. నార్త్ లో ఊహించిన దానికంటే అత్యధికంగా వసూళ్లు, రెస్పాన్స్ రావడం, పైగా ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర కావడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ మార్చి 7న గ్రాండ్ విడుదల చేశారు. ఇక్కడా దుమ్ములేపిందీ చిత్రం. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలో కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. కాగా తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 11 నుంచి ఆడియెన్స్ కు అందుబాటులోకి రానుంది.
ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ పంపిణీ చేసింది. తెలుగు వెర్షన్ హక్కులను గీతా ఆర్ట్స్ ఏపీ, తెలంగాణలో పంపిణీ చేసింది. తెలుగు వెర్షన్ బ్రహ్మాండమైన విజయాన్ని సాధించడంతో ఇక ఓటీటీలోనూ ఈ సినిమా ఏ రేంజ్ లో వ్యూయర్ షిప్ ను అందుకుంటుందో వేచి చూడాలి. ఇక ఛావా చిత్రం తెలుగులో ఇప్పటికీ వసూళ్లను అందుకుంటూనే ఉంది. ఇప్పటి వరకు ఏపీ, తెలంగాణలో కలిసి రూ.16 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది.
ఇక రూ.140 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు అందాయి. వరల్డ్ వైడ్ గా 45 రోజులుగా వసూళ్లు అందుకుంటూనే ఉందీ చిత్రం. ఇప్పటి వరకు రూ.790 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసి ఆశ్చర్యపరిచింది. ఈ హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్ కు ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











