OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి సూపర్ హిట్ వైల్డ్ మూవీ... ఎందులో చూడాలంటే?
అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ సృష్టించిన సందీప్ రెడ్డి వంగా తాజాగా యానిమల్ చిత్రాన్ని రణబీర్ కపూర్ తో తెరకెక్కించాడు. ఏ ముహుర్తంలో తెరకెక్కించాడో ఏమో కానీ... రెండు, మూడు నెలలుగా యానిమల్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పంజా విసిరిన యానిమల్... ఇప్పుడు ఓటీటీపై దండయాత్ర చేసేందుకు వచ్చేస్తుంది. ఓటీటీ రిలీజ్ కు ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది ఈ వైల్డ్ మూవీ. ఆ వివరాల్లోకి వెళితే...
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా.. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వచ్చిన వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్... ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ మూవీ యాక్షన్ అండ్ ఎమోషనల్ కంటెంట్‌తో వైల్డ్ గా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించాడు. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలో నటించగా... నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, తృప్తి డిమ్రి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది.

మొదటి రోజు నుంచే 'యానిమల్' మూవీకి ఇండియాలో మంచి ఆదరణ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ చిత్రం భారీగానే వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ. 900 కోట్లుకు పైగా గ్రాస్‌ను, రూ. 550 కోట్లకు పైగా నెట్ వసూళ్లను రాబట్టి యానిమల్ రికార్డులు సృష్టించింది. ఇక థియేటర్ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
వారి నిరీక్షణకు తెరదించుతూ.. ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. యానిమల్ సినిమా తాజాగా అఫిషియల్ ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను భారీ ధరకు డిజిటల్ ప్రీమియర్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ చెయొద్దంటూ పలువురు కోర్టును ఆశ్రయించారు. ఇక ఓటీటీ రిలీజ్ పై ఎట్టకేలకు కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ వేదికగా జనవరి 26 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. టట
అయితే నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అయ్యే యానిమల్ చిత్రం.. థియేటర్ వర్షన్ కాకుండా.. మరోలా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకు కొత్త కంటెంట్‌ను యాడ్ చేసి దీన్ని తీసుకు రాబోతున్నారట మేకర్స్. తాజా సమాచారం ప్రకారం.. 3 గంటల 29 నిమిషాల 34 సెకెన్ల నిడివితో ఓటీటీ వెర్షన్ రాబోతుందని తెలుస్తోంది. యానిమల్ సినిమా ఓటీటీ వెర్షన్‌కు 20 నిమిషాలు జత చేయనున్నారు. దీంతో థియేటర్లో చూసిన వారు కూడా ఎక్జైట్ గా ఈ సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు.
ఇక యానిమల్ మూవీ విషయానికి వస్తే... టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు సంయుక్తంగా రూపొందించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందించారు. మీరు ఈ సినిమాను థియేటర్లో చూసినా.. ఓటీటీలో మళ్లీ చూసి ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











