RAVANASURA OTT: ఆ ఓటీటీలోకి రావణాసుర.. స్ట్రీమింగ్ మాత్రం అప్పటి నుంచే!
ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ యమ జోష్‌తో కనిపిస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. దీనికితోడు 'ధమాకా'తో గత ఏడాది భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అతడు.. వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరిపోయాడు. అంతేకాదు, ఈ ఏడాది ఆరంభంలోనే 'వాల్తేరు వీరయ్య'తో మరో విజయాన్ని కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఇలా వరుస విజయాలతో యమ ఉత్సాహంతో కనిపిస్తోన్న రవితేజ.. ఇప్పుడు 'రావణాసుర' అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీంతో థియేటర్లన్నీ ఈ మాస్ హీరో ఫ్యాన్స్‌తో కళకళలాడుతున్నాయి.
మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ తెరకెక్కించిన చిత్రమే 'రావణాసుర'. ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీగానే దక్కుతోంది. దీంతో మొదటి రోజు షోలు దాదాపుగా ఫుల్ అయిపోయాయి. దీంతో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'రావణాసుర' మూవీ ఓటీటీ డీల్ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.

క్రైమ్ యాక్షన్‌తో రూపొందిన 'రావణాసుర' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన యాభై రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు. అంటే నేడు విడుదలైన 'రావణాసుర' మే చివరి వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందనే టాక్ ఫిలిం నగర్‌లో వినిపిస్తోంది.
రవితేజ - సుధీర్ వర్మ కాంబోలో రూపొందిన 'రావణాసుర' సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. దీనికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం ఇచ్చారు. ఇందులో అను ఇమాన్యూయేల్, మీనాక్షి చౌదరి, ఫరియా అబ్ధాల్లా, దక్ష, పూజితలు కీలక పాత్రల్లో నటించగా.. సుశాంత్ ఎంతో ముఖ్యమైన రోల్ చేశాడు.


Click it and Unblock the Notifications











