బిగ్ సర్‌ప్రైజ్: ఓటీటీలోకి వచ్చేసిన రావణాసుర.. నెల కూడా కాకముందే స్ట్రీమింగ్
ఫలితాలతో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో సినిమాలు చేసే హీరోల్లో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు మాస్ మహారాజా రవితేజ. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్న అతడు.. గత ఏడాది వచ్చిన 'ధమాకా'తో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరిపోయాడు. అంతేకాదు, ఈ ఏడాది 'వాల్తేరు వీరయ్య'తో మరో హిట్‌ను కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఇలా వరుస విజయాలతో యమ ఉత్సాహంతో కనిపిస్తోన్న రవితేజ.. ఇటీవలే 'రావణాసుర' అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీనే 'రావణాసుర'. విడుదలకు ముందే ఈ చిత్రం భారీ అంచనాలను ఏర్పరచుకుంది. అయితే, ఊహించని విధంగా ఈ మూవీకి మొదట్లోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దీనికి చాలా తక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఇలా ఫుల్ రన్‌లో ఈ సినిమా రూ. 12 కోట్లు వరకూ షేర్‌తో పాటు రూ. 21 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది. ఫలితంగా రూ. 23.00 కోట్లు టార్గెట్‌తో బరిలోకి దిగిన రవితేజ సినిమా.. ఏకంగా రూ. 11 కోట్లకు పైగానే నష్టాలను ఎదుర్కొని డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

థియేటర్లలో పెద్దగా రాణించలేకపోయిన రవితేజ 'రావణాసుర' మూవీ.. అనుకున్న సమయానికి కంటే ఓటీటీలోకి వచ్చేస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా (ఏప్రిల్ 28) ఈ చిత్రం ఓటీటీలో ప్రత్యక్షం అయిపోయింది. అమెజాన్ ప్రైమ్‌లో ఇది తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చేసింది. ఈ బిగ్ సర్‌ప్రైజ్‌తో మాస్ హీరో రవితేజ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉండగా.. రవితేజ - సుధీర్ వర్మ కలయికలో తెరకెక్కిన 'రావణాసుర' సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. దీనికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం ఇచ్చారు. ఇందులో అను ఇమాన్యూయేల్, మీనాక్షి చౌదరి, ఫరియా అబ్ధాల్లా, దక్ష, పూజితలు కీలక పాత్రల్లో నటించగా.. సుశాంత్ ముఖ్యమైన రోల్ చేశాడు.\


Click it and Unblock the Notifications











