OTTలోకి నేరుగా రవిబాబు 'అసలు'.. మళ్లీ ఆమెతోనే మూవీ.. కామన్ గా 2 విషయాలు!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు, దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు రవిబాబు. విలక్షణమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా డైరెక్టర్ గానూ తన మార్క్ చూపించారు. కామెడీ, డ్రామా, క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ వంటి సినిమాలు తీయడంలో రవిబాబుకు స్పెషల్ క్రేజ్ ఉంది. స్టన్నింగ్ బ్యూటి భూమిక ప్రధాన పాత్రలో అనసూయ సినిమా తెరకెక్కించి మంచి విజయం సాధించారు. ఆ తర్వాత అమరావతి, అవును వంటి చిత్రాలతో సక్సెస్ కొట్టిన ఆయన మరోసారి హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

తెలుగు చిత్ర పరిశ్రమలో కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా సత్తా చాటుతున్నవారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటుడు, డైరెక్టర్ రవిబాబు ఒకరు. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన తెరకెక్కించే సినిమాలకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అల్లరి నరేష్ ను హీరోగా పరిచయం చేస్తూ అల్లరి సినిమాతో హిట్ కొట్టారు రవిబాబు. ఈ సినిమా పేరు నరేష్ కు అల్లరి నరేష్ గా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు, సోగ్గాడు, పార్టీ వంటి సినిమాలు తెరకెక్కించారు రవిబాబు. ఈ సినిమాలు అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి.

Ravi Babu Poorna Asalu Movie Directly Released In OTT ETV Win

ఇక ముద్దుగుమ్మ భూమిక లీడ్ రోల్ లో అనసూయ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కించారు రవిబాబు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకుంది. తర్వాత కొన్ని లవ్ స్టోరీలు సినిమాలు చేసిన అవి యావరేజ్ గా నిలిచాయి. దీంతో మళ్లీ అమరావతి, అవును 1 అండ్ 2 చిత్రాలు తెరకెక్కించారు రవిబాబు. వీటిలో అవును సినిమా విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి అలాంటి జోనర్ లో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు రవిబాబు. ఆయన తాజాగా దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం 'అసలు'.

రవిబాబా లేటెస్ట్ మూవీ అసలులో హీరోయిన్ గా పూర్ణ నటిస్తోంది. అయితే ఈ సినిమాలో రెండు విషయాలు కామన్ గా ఉన్నాయి. ఇందులో నటిస్తున్న పూర్ణ గతంలో తెరకెక్కించిన అవును సిరీస్ లోనూ లీడ్ రోల్ చేసింది. ఇక రవిబాబు మొదటి నుంచి తీస్తున్న చిత్రాలన్నీ 'అ' అనే అక్షరంతోనే స్టార్ట్ అవుతాయి. అల్లరి, అమ్మాయిలు అబ్బాయిలు, అనసూయ, అమరావతి, అవును 1 అండ్ 2, అదుగో, ఆవిరి ఇలా మరోసారి అ అక్షరం వచ్చేలా అసలు అని టైటిల్ పెట్టారు. అయితే ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి తీసుకువస్తున్నారు. ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా ఏప్రిల్ 5 నుంచి అసలు మూవీని స్ట్రీమింగ్ చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X