ఓటీటీలో అదరగొడుతున్న రవిబాబు రష్.. ఈ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?
దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో వేగంగా మారుతన్న అభిరుచులను బట్టి చూస్తే.. సినిమాలు థియేటర్లలో కంటే ఎక్కువగా ఓటీటీలోనే హిట్ అవుతున్నాయి. చాలా మంది థియేటర్లకు ముఖం చాటేసి ఓటీటీలపై మోజు పెంచుకోవడంతో మంచి కంటెంట్ ఉండే వెబ్ మూవీస్, వెబ్ సిరీస్ లాంటి వాటికి ప్రేక్షకులు, సినీ అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా ఓటీటీలో రిలీజైన రష్ సినిమా ఈటీవీ విన్ యాప్‌లో దుమ్మురేపుతున్నది. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..
నటుడు, దర్శకుడు, నిర్మాత రవిబాబు కథ, స్క్రీన్ ప్లే అందించిన చిత్రం రష్. ఈ సినిమాకు సతీష్ పోలోజు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో డైసీ బోపన్న ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం పాపులర్ ఓటీటీ యాప్ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకొంటున్నది.

ఓ సాధారణ మహిళకు అసాధారణ పరిస్థితులు ఎదురైతే వాటిని ఎలా ఎదురించారు. ఓ సాధారణ గృహిణికి అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే పాయింట్‌తో మహిళలకే కాదు అన్నివర్గాలకు స్పూర్తిదాయకంగా నిలిచేలా సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో చూపించిన సామాజిక సమస్యలు కూడా ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా ఉండటం ఈ మూవీకి ప్లస్ పాయింట్.
యాక్షన్, థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ కూడా ఇందులో చక్కగా పొందుపరిచారు. ఇలాంటి జోనర్లను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందనే భావనను కల్పించారు. ఓటీటీలో కాబట్టి.. తీరిక వేళలో మంచి టైమ్, మూడ్ సెట్ చేసుకొని చూడండి.. తప్పకుండా నచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈటీవీ విన్ విషయానికి వస్తే.. ఇటీవల ప్రారంభించిన యాప్‌లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఫ్యామిలీలో అందరూ కలిసి చూసే విధంగా కంటెంట్‌ను ఎంచుకొంటున్నారు. అందుకు ఉదాహరణ శివాజీ నటించిన నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్.
ఇక రవిబాబు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పనక్కర్లేదు. అల్లరి, నచ్చావులే, మనసారా, అనసూయ, అమరావతి, అవును, అవును 2 చిత్రాలను రూపొందించడమే కాకుండా మెప్పించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











