twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ramarao On Duty OTT లో విడుదలయ్యేది అప్పుడే.. డీసెంట్ రేటుకు కొనుగోలు చేసిన ప్రముఖ సంస్థ!

    |

    మాస్ మహారాజ్ రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ మొదటిసారి ఒక సివిల్ ఆఫీసర్ గా భిన్నమైన పాత్రలో కనిపించాడు. అయితే ఈ సినిమా థియేటర్లకు వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు ఓటీటీ లో వస్తుంది అనే విషయం అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. ఇక ప్రముఖ ఓటీటీ సంస్థ రామారావు సినిమా స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. స్ట్రీమింగ్ కాబోయే డేట్ వంటి వివరాల్లోకి వెళితే..

    సక్సెస్ తరువాత

    సక్సెస్ తరువాత

    సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సేనమాలు చేస్తున్న రవితేజ ఆ మధ్యకాలంలో క్రాక్ సినిమాతో ఊహించిన విధంగా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఇక తర్వాత వచ్చిన ఖిలాడి సినిమా మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఆర్థికంగా కూడా ఆ సినిమా చాలా దెబ్బ కొట్టింది అనే చెప్పాలి.

     రవితేజ కాన్ఫిడెన్స్

    రవితేజ కాన్ఫిడెన్స్

    ప్రస్తుతం రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు అనిపిస్తోంది. ఈ సినిమాకు గ్యాప్ లేకుండా గత వారం రోజులుగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు. ప్రత్యేకంగా ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటున్నారు. రవితేజ సినిమా పై చాలా కాన్ఫిడెన్స్ తో గా ఉన్నట్లు అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాలో సరికొత్త థ్రిల్లింగ్ పాయింట్స్ కూడా హైలెట్ కాబోతున్నట్లు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.

    నాన్ థియేట్రికల్ బిజినెస్

    నాన్ థియేట్రికల్ బిజినెస్

    ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 18 కోట్ల వరకు బిజినెస్ అయితే చేసింది. 18.5 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంటేనే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయినట్లు లెక్క. నాన్ థియేట్రికల్ గా ఈ సినిమా ఒక విధంగా నిర్మాతలకు మంచి ప్రాఫిట్ అందించినట్లు సమాచారం. దాదాపు నాన్ థియేట్రికల్ గానే 14 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక అందులో ఓటిటి హక్కుల రూపంలోనే ఎక్కువగా ప్రాఫిట్ వచ్చినట్లు సమాచారం.

     ఆ సంస్థకు ఓటీటీ

    ఆ సంస్థకు ఓటీటీ

    రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఓటీటీ హక్కులు సోనీ లీవ్ సంస్థ దక్కించుకుంది. మొదట అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా హక్కుల కోసం బాగానే పోటీ పడినప్పటికీ ఆ తర్వాత సోనీ లీవ్ ద్వారా మంచి ఆఫర్ రావడంతో నిర్మాతలు ఆ సంస్థకు ఓటీటీ హక్కులను అమ్మేశారు. రవితేజ కెరీర్ లోనే రామారావు ఆన్ డ్యూటీ సినిమా మంచి ఓటీటీ డీల్ సెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

     స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?

    స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?

    నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ సినిమా అనుకున్నంతగా పాజిటివ్ టాక్ అయితే అందుకోలేకపోయింది. ఇక ఓటీటీ లో ఎప్పుడు విడుదల చేస్తారీ అనే విషయంలో ప్రస్తుతం మరొక టాక్ వైరల్ గా మారుతుంది. ఈ సినిమాను నాలుగు వారాల తర్వాతనే ఓటీటీ లో విడుదల చేయాలి అని ఒక డీల్ సెట్ అయినట్లు సమాచారం అంటే ఆగస్టులో 22వ తేదీ లేదా 24వ తేదీన సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కావచ్చు అని సమాచారం.

    English summary
    Ravi Teja Ramarao on duty OTT release date streaming rights
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X