Ravi Teja రావణాసుర సినిమాకు అదిరిపోయే ఆఫర్స్.. ఆ సంస్థకు ఓటీటీ హక్కులు!
మాస్ మహరాజ్ రవితేజ నటించిన రావణాసుర మూవీ ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతోంది. సుదీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హైవోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది. నెగిటివ్ హీరోయిజంతో ఈ మూవీ కథాంశం నడుస్తుంది అని తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ తో కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ ట్రైలర్ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ చేస్తుంది.
ఈ సినిమాతో హ్యాట్రిక్ ని మరోసారి ఖాతాలో వేసుకోవాలని రవితేజ ఆలోచిస్తూ ఉన్నాడు. అలాగే మరోసారి ఈ మూవీతో వంద కోట్ల క్లబ్ లో చేరాలని భావిస్తున్నారు. ఇక ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్, ఫారియా అబ్దులా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక హీరోయిన్స్ తో కూడా మంచి రొమాంటిక్ కామెడీ మూవీలో ఉండబోతుంది అని అర్ధం అవుతుంది.

చట్టంలో లొసుగులు అన్ని తెలిసిన ఒక లాయర్ క్రిమినల్ గా ఎందుకు మారాడు. చట్టానికి దొరకకుండా హత్యలు చేస్తూ ఎందుకు తప్పించుకుంటున్నాడు అనే పాయింట్స్ ఈ సినిమాలో దర్శకుడు సుదీర్ వర్మ రవితేజ పాత్రతో చూపించబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా థీయాట్రికల్ బిజినెస్ ఇప్పటికే పూర్తయ్యింది. ఇప్పుడు నాన్ థీయాట్రికల్ రైట్స్ కూడా అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది.
ముఖ్యంగా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఒటీటీ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఇక ఫ్యాన్సీ రేటు చెల్లించి ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది అని టాక్. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలపై నెట్ ఫ్లిక్స్ భారీగా పెట్టుబడి పెట్టి హక్కులు దక్కించుకుంటుంది.
ఈ నేపధ్యంలో రావణాసుర మూవీ కోసం కూడా నెట్ ఫ్లిక్స్ పోటీ పడినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఈ పోటీలో అమెజాన్ ఎక్కువ ఆఫర్ చేయడంతో ఫైనల్ గా వారే హక్కులని సొంతం చేసుకున్నారు. సినిమా సూపర్ హిట్ అయితే 50 రోజుల తర్వాత ఒటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆశించిన స్థాయిలో టాక్ రాకుంటే ముందుగానే డిజిటల్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.


Click it and Unblock the Notifications











