EAGLE OTT: ఈగల్ ఓటీటీపై బిగ్ ట్విస్ట్.. రవితేజ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాక్
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన చిత్రాలతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరించడంతో పాటు తన రేంజ్‌ను కూడా పెంచుకుంటూ వెళ్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్న ఈ స్టార్ హీరో.. ఇటీవలి కాలంలో పెద్దగా ఫామ్‌లో లేడు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న పట్టుదలతో 'ఈగల్' మూవీ చేశాడు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన మాస్ మూవీనే 'ఈగల్'. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ చిత్రానికి రెస్పాన్స్ కూడా మంచిగానే లభించింది. ఇలా ఈ సినిమా ఫస్ట్ వీక్‌లో మంచి వసూళ్లను రాబట్టినా.. రెండో వారంలో మాత్రం పూర్తిగా డౌన్ అయిపోయింది.

పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఈగల్' మూవీకి థియేటర్లలో ఆశించిన రీతిలో రెస్పాన్స్ లభించలేదు. ఫలితంగా ఈ చిత్రం దాదాపుగా అన్ని ప్రాంతాల్లో రన్‌ను ముగించుకుని నష్టాల దిశగా పయణిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'ఈగల్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఎన్నో రకాల చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు, ఇది నెల రోజుల్లోపే అందుబాటులోకి వచ్చేస్తుందని టాక్ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ డీల్ ఇంకా పూర్తి కాలేదని తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది.

మాస్ మహారాజా రవితేజ - కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో రూపొందిన 'ఈగల్' మూవీ ఓటీటీ డీల్ ఇంకా పూర్తి కాలేదన్న వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. అదే నిజం అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ ఇప్పట్లో ఉండే అవకాశం లేదు. ఇది నిజంగా రవితేజ అభిమానులకు షాకింగ్ న్యూసే అని చెప్పొచ్చు.
ఇదిలా ఉండగా.. హై రేంజ్ యాక్షన్‌తో రూపొందిన 'ఈగల్' మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాకు Davzand సంగీతాన్ని ఇచ్చాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్, మధు బాల తదితరులు కీలక పాత్రలను పోషించారు.


Click it and Unblock the Notifications











