EAGLE OTT: ముందుగానే ఓటీటీలోకి ఈగల్.. రవితేజ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్

సాధారణంగా ఏ హీరో అయినా సినిమాలు హిట్ అయితేనే రెట్టించిన ఉత్సాహంతో కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటాడు. కానీ, కొందరు మాత్రం ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా మూవీలు చేస్తూనే ఉంటారు. అలాంటి వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్న అతడు.. ఇటీవలే 'ఈగల్' మూవీతో వచ్చాడు.

సరైన హిట్ కోసం వేచి చూస్తోన్న మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన యాక్షన్ మూవీనే 'ఈగల్'. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ చిత్రానికి రెస్పాన్స్ బాగానే లభించింది. ఇలా ఈ సినిమా ఫస్ట్ వీక్‌లో మంచి వసూళ్లను రాబట్టినా.. రెండో వారం నుంచి ప్రభావాన్ని కోల్పోతూ డౌన్ అయిపోయింది.

Ravi Teja Starrer EAGLE Movie Streaming From March 1st

డిఫరెంట్ యాక్షన్‌తో రూపొందిన 'ఈగల్' మూవీకి థియేటర్లలో ఆశించిన రీతిలో రెస్పాన్స్ లభించలేదు. ఫలితంగా ఈ చిత్రం దాదాపుగా భారీ స్థాయిలోనే నష్టాలను మూటగట్టుకుంది. ఆ తర్వాత ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డీల్‌పై ఎన్నో ప్రచారాలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో ఇటీవలే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్‌ దక్కించుకున్నట్లు ప్రకటించారు.

మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఈగల్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ఒకేసారి ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్ వీడియోలలో ప్రారంభం కాబోతుందని ప్రకటనలు వచ్చాయి. దీంతో ఈ సినిమా మార్చి 2వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుందని ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రవితేజ సినిమా ఓటీటీ డేట్‌ను సదరు సంస్థ అధికారికంగా ప్రకటించేసింది.

Ravi Teja Starrer EAGLE Movie Streaming From March 1st

మాస్ మహారాజా రవితేజ - కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో రూపొందిన 'ఈగల్' మూవీని మార్చి 1వ తేదీ నుంచే అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ఈటీవీ విన్ ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ కూడా అదే రోజు నుంచి స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది. అంటే ఒకరోజు ముందుగానే ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. అందులోనూ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ దక్కబోతుందని చెప్పాలి.

ఇదిలా ఉండగా.. టాలీవుడ్ మాస్ హీరో రవితేజ నటించిన 'ఈగల్' మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాకు Davzand సంగీతాన్ని ఇచ్చాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్, మధు బాల తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X