నెల కాకుండనే ఓటీటీలోకి మిస్టర్ బచ్చన్.. రవితేజ డేట్ వచ్చేసిందిగా!
టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న తర్వాత ఎవరికీ అందనంత వేగంగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈ మధ్య కాలంలో అయితే హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా 'ధమాకా' తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం చూస్తున్నాడు. ఇలా రవితేజ ఇటీవలే 'మిస్టర్ బచ్చన్' అనే సినిమా చేశాడు.
టాలీవుడ్ స్టార్ రవితేజ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన సినిమానే 'మిస్టర్ బచ్చన్'. ఐటీ డిపార్ట్‌మెంట్‌లోని సిన్సియర్ ఆఫీసర్ నేపథ్యంతో ఈ సినిమా కమర్షియల్‌గా రూపొందింది. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇది అత్యధిక బిజినెస్‌ను జరుపుకుని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మిస్టర్ బచ్చన్' సినిమాకు ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ అయింది. దీంతో ఆరంభంలోనే అనుకున్న విధంగా వసూళ్లు దక్కలేదు. ఆ తర్వాత కూడా ఈ చిత్రం ఏమాత్రం ప్రభావం చూపలేదు. దీంతో వారంలోనే ఈ సినిమా రన్‌ను ముగించుకుని డిజాస్టర్ అయింది.
హరీష్ శంకర్ - రవితేజ కలయికలో తెరకెక్కిన 'మిస్టర్ బచ్చన్' మూవీపై అంచనాలు ఉండడంతో.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు పోటీ కూడా భారీగానే ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. ఇక, ఇప్పుడు 'మిస్టర్ బచ్చన్' స్ట్రీమింగ్‌పై సదరు సంస్థ అధికారిక ప్రకటనను కూడా చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది.

థియేట్రికల్ రన్‌తో నిరాశ పరిచిన 'మిస్టర్ బచ్చన్' సినిమా వీలైనంత త్వరగా ఓటీటీలోకి వస్తుందని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లే దీన్ని సెప్టెంబర్ 12వ తేదీ నుంచే స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ తాజాగా ప్రకటించింది. దీంతో మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
ఇదిలా ఉండగా.. హిట్ కాంబినేషన్‌లో రూపొందిన 'మిస్టర్ బచ్చన్' సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, సత్య, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











