మిస్టర్ బచ్చన్ ఓటీటీ డేట్ ఫిక్స్.. నెల కూడా కాకుండానే వచ్చేస్తుందా!
తెలుగు సినిమా రంగంలో హిట్లు ఫ్లాపులను అస్సలు పట్టించుకోకుండా ఎంతో వేగంగా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో మాస్ మహారాజా రవితేజ ఒకడు. కమర్షియల్ హీరోగా మారిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోన్న అతడు.. ఏకధాటిగా మూవీలు చేస్తున్నాడు. ఇలా ఇటీవలే ఈ మాస్ హీరో 'మిస్టర్ బచ్చన్' మూవీ చేశాడు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ హరీష్ శంకర్ రూపొందించిన చిత్రమే 'మిస్టర్ బచ్చన్'. ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లోని సిన్సియర్ ఆఫీసర్ నేపథ్యంతో ఈ సినిమా రూపొందింది. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఇది అత్యధిక బిజినెస్‌ను జరుపుకుని ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మిస్టర్ బచ్చన్' సినిమాకు ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ అయింది. దీంతో ఆరంభంలోనే అనుకున్న విధంగా వసూళ్లు లభించలేదు. ఆ తర్వాత కూడా ఈ చిత్రం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీంతో వారంలోనే ఈ చిత్రం రన్‌ను ముగించుకుని డిజాస్టర్‌గా మిగిలింది.
హరీష్ శంకర్ - రవితేజ కాంబినేషన్‌లో రూపొందిన 'మిస్టర్ బచ్చన్' మూవీపై హైప్ ఉండడంతో.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు పోటీ కూడా భారీగానే ఏర్పడింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు. ఇక, ఇప్పుడు 'మిస్టర్ బచ్చన్' స్ట్రీమింగ్‌పై క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.
థియేటర్లలో ఏమాత్రం ప్రభావాన్ని చూపలేకపోయిన 'మిస్టర్ బచ్చన్' సినిమా వీలైనంత త్వరగా ఓటీటీలోకి వస్తుందని అంతా అనుకున్నారు. అందుకు అనుగుణంగానే దీన్ని నెల రోజులు కాకుండానే స్ట్రీమింగ్ చేస్తారని తాజాగా ఓ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. రవితేజ సినిమాను సెప్టెంబర్ 12వ తేదీ నుంచే అందుబాటులోకి తీసుకు వస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజం అయితే మాస్ మహారాజా ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి.

ఇదిలా ఉండగా.. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రూపొందిన 'మిస్టర్ బచ్చన్' సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, సత్య, చమ్మక్ చంద్ర కీలక పాత్రలు చేశారు.


Click it and Unblock the Notifications











