Tiger Nageswara Rao OTT: ఆ ఓటీటీలోనే రవితేజ మూవీ.. స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే!
బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చి.. ఎలాంటి సపోర్ట్ లేని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగిన హీరోనే రవితేజ. ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌కు అభిమాన హీరోగా మారిన అతడు మాస్ మహారాజా అనే బిరుదును తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. అయితే, 'ధమాకా' తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం వేచి చూస్తోన్న రవితేజ.. ఇప్పుడు 'టైగర్ నాగేశ్వరరావు' అనే పాన్ ఇండియా సినిమాలో నటించాడు. ఆరంభంలోనే ఎన్నో అంచనాలు ఏర్పరచుకున్న ఈ మూవీ తాజాగా విడుదలైంది.
మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ తెరకెక్కించిన మాస్ మూవీనే 'టైగర్ నాగేశ్వరరావు'. 1970 కాలంలో గజగజలాడించిన స్టువర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వర్రావు జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే డీసెంట్ టాక్ వస్తోం. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే కంటిన్యూ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే లభిస్తోంది. తెలుగులో ఈ సినిమా షోలకు బుకింగ్స్ పెరుగుతున్నాయి. దీంతో దీనికి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఒకవైపు 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా సందడి థియేటర్లలో మొదలు అవుతుండగా.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. దీని ప్రకారం.. ఈ సినిమాను తీవ్ర పోటీ నడుమ అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో రివీల్ చేశారు. ఇక, ఈ హక్కుల కోసం సదరు సంస్థ భారీ మొత్తాన్నే చెల్లించినట్లు తెలిసింది. ఇది రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్ అని ట్రేడ్ వర్గాల వాళ్లు చెప్పుకుంటున్నారు.

ఇక, మాస్ మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాను థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని కూడా ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది. అంటే అక్టోబర్ 20వ తేదీన విడుదలైన 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రం డిసెంబర్ రెండో వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. 'టైగర్ నాగేశ్వర్రావు' మూవీని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. దీనికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. ఇందులో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని హిందీలో కూడా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.


Click it and Unblock the Notifications











