బిగ్ సర్‌ప్రైజ్: షడన్‌గా ఓటీటీలోకి టైగర్ నాగేశ్వరరావు.. థియేటర్లలో చూపించింది కాకుండా!

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్యూర్ మాస్ ఇమేజ్‌తో కొంత మంది హీరోలు సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకడు. సుదీర్ఘ కాలంగా పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తోన్న అతడు.. క్రమంగా తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇలా 'ధమాకా'తో వంద కోట్ల క్లబ్‌లో చేరిన తర్వాత 'రావణాసుర'తో డిజాస్టర్ చవి చూశాడు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ఇటీవలే రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' అనే పాన్ ఇండియా సినిమాలో నటించాడు.

మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ అనే డైరెక్టర్ తెరకెక్కించిన సినిమానే 'టైగర్ నాగేశ్వరరావు'. 1970 కాలంలో గజగజలాడించిన స్టువర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వర్రావు జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే డీసెంట్ టాక్ వచ్చింది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఫలితంగా ఈ మూవీ నష్టాలతోనే రన్‌ను ముగించాల్సి వచ్చింది.

Ravi Teja Starrer Tiger Nageswara Rao Movie Streaming Started on Amazon Prime

పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీపై ఆరంభం నుంచీ అంచనాలు నెలకొనడంతో.. దీని డిజిటల్ రైట్స్‌కు భారీ స్థాయిలో పోటీ ఏర్పడింది. తీవ్ర డిమాండ్ నడుమ ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను ఫేమస్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇందులో సదరు సంస్థ భారీ మొత్తాన్నే చెల్లించినట్లు తెలిసింది. ఇది రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్ అని ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది.

మాస్ మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని ఓ న్యూస్ ప్రచారం అయింది. అలాంటిది ఈ చిత్రం నెల కూడా కాకముందే అంటే ఈ అర్ధరాత్రి నుంచే తాజాగా ఆ ఓటీటీలో ప్రత్యక్షం అయిపోయింది.

Ravi Teja Starrer Tiger Nageswara Rao Movie Streaming Started on Amazon Prime

వంశీ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీని అమెజాన్ తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళంలో స్ట్రీమింగ్ చేస్తోంది. ఇందులో సెన్సార్‌లో కట్ అయిన సీన్స్‌ను కూడా యాడ్ చేశారని తెలిసింది.

ఇక.. 'టైగర్ నాగేశ్వర్రావు' మూవీని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. దీనికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. ఇందులో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X