Tiger Nageswara Rao OTT: అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీలోకి టైగర్ నాగేశ్వరరావు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
మాస్ మహారాజా రవితేజ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన ఈయన ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి ఆ తర్వాత హీరోగా మారారు. అయితే రవితేజ హీరోగా తాజాగా వచ్చిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఆంధ్రా రాబిన్ హుడ్ అని పేరు పొందిన స్టూవర్టుపురం నాగేశ్వరావు కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అక్టోబర్ 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేశారు.
1970 కాలంలో గజగజలాడించిన స్టువర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వర్రావు జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు వంశీకృష్ణ దర్శకత్వం వహించారు. అలాగే ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ చిత్రంలో రవితేజన సరసన నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ లో హీరోయిన్లుగా నటించారు. అలాగే జయవాణి పాత్రలో అనుకీర్తి వ్యాస్ నటించి మెప్పించారు. అలాగే రేణూ దేశాయ్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, బెంగాలీ నటుడు జిష్షు సేన్ గుప్తా, నాజర్, హరీష్ పేరడి, వాసుదేవ్ నాయర్, నరేన్, ప్రదీప్ రావత్ లు కూడా ఈ సినిమాలో నటించారు.

అయితే థియేటర్ల వద్ద పాటిటివ్ టాక్ సొంతం చేసుకున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్ధ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ఈ ఓటీటీ వేదికగానే విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే సినిమా విడుదల అయిన తర్వాత ఎనిమిది వారాల వ్యవధిలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా అగ్రిమెంట్ చేసుకున్నట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా అంటే డిసెంబర్ రెండో వారంలో ఓటీటీలో విడుదల చేస్తారని కూడా టాక్ నడిచింది.

కానీ తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. టైగర్ నాగేశ్వర రావు చిత్రాన్ని అనుకున్న దానికంటే ముందుగానే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి డిసెంబర్ రెండో వారంలో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని నవంబర్ 24వ తేదీ నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుందని గట్టిగా వినిపిస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కాకపోవడం అందులోనూ పాజిటివ్ టాక్ తో సరిపెట్టుకోవడం వల్లే సినిమాను అనుకున్న తేదీ కంటే ముందుగానే ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారుట.

రవితేజ సినిమా మాత్రమే కాదండోయ్.. ఇటీవలే విజయ్ దళపతి సినిమా లియోను కూడా ఇలాగే అనుకున్న తేదీ కంటే ముందుగానే విడుదల చేశారు. ముఖ్యంగా ఆ సినిమా ఫుల్ హెచ్డీ ప్రింట్ ఆన్ లైన్ లో లీకవ్వడంతో... ప్లాన్ మార్చుకొని మరీ సినిమాను ముందుగా రిలీజ్ చేశారు. నవంబర్ 24వ తేదీన వస్తుందనుకున్న లియో.. నవంబర్ 16వ తేదీనే రాబోతుందని సమాచారం. పలు కారణాల వల్ల స్టార్ హీరోల సినిమాలు కూడా వెంటనే ఓటీటీల్లోకి వస్తుండడం గమనార్హం.


Click it and Unblock the Notifications











