సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్.. ఎందులో చూడాలంటే?
ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. చాలా పెద్ద సినిమాలు, హిట్టుగా నిలిస్తే తప్ప ఓటీటీలోకి కాస్త ఆలస్యంగా వస్తున్నాయి. లేదంటే నెలలోపే ఓటీటీలోకి వచ్చి అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి. ప్రతీ వారం ఓటీటీలో సినీ జాతర జరగుతోంది. ముఖ్యంగా శుక్రవారం వచ్చిందంటే చాలు అనేక చిత్రాలు ఓటీటీ వేధికగా అలరిస్తున్నాయి. అయితే తాజాగా వచ్చిన ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఓటీటీ వేధికగా స్ట్రీమింగ్ అవుతోంది. అది ఎక్కడ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రజశేఖర్ సుద్మూన్ దర్శకత్వంలో... రవితేజ మహాదాస్యం, విషిక లక్ష్మణ్ లు హీరోహీరోయిన్లుగా వచ్చిన తాజా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ యే సగిలేటి కథ. అక్టోబర్ 13వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఎవరూ ఊహించని స్థాయిలో హిట్టు టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి అశోక్ మిట్టపల్లి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అచ్చమైన, స్వచ్ఛమైన రాయలసీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాలో నటీనటులు అద్భుతమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా ఓ ఊరి జాతరలో జరిగే ఓ సంఘటన.. ప్రేమజంటపై ఎలాంటి ప్రభావం చూపించింది, అలాగే కోడికూర తినాలనుకునే ఓ పేద వాడి కోరిక ఏమైందనే కథాంశంతో రూపొందిందీ చిత్రం.

స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణంలో అత్యద్భుతంగా సాగిన ఈ కథకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు వచ్చాయి. ఇంతటి అద్భుతమైన చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టుకోలేకపోయింది. అందుకు ప్రధాన కారణాలు థియేటర్లలో పెదద్ సినిమాలు ఉండడం. దాని వల్లే ఈ సినిమా అంతగా వసూళ్లు సాధించలేకపోయింది. కానీ టాక్ మాత్రం అదిరిపోయింది. ట్రైలర్, టీజర్ లతో పాటు రీవ్యూలు కూడా చాలా చక్కగానే వచ్చాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్లుగా ప్రేమించుకోగా.. హీరో తండ్రి, గంగమ్మ తల్లి జాతరలో వచ్చిన కొన్ని గొడవల కారణంగా హీరోయిన్ తండ్రిని చంపేస్తాడు.

అయితే ఈ హత్య వల్ల హీరోహీరోయిన్ల ప్రేమ ఏమైంది, చివరకు వాళ్లు ఒక్కటి అయ్యారా లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమాలోనే చూడాలి. మరోవైపు ఓ పేద వాడు చికెన్ తినాలనుకుంటాడు. ఈ ఘటనతో అతడు చికెన్ తినగల్గుతాడా లేదా అనేది కూడా సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. అయితే ఈ సినిమా విడుదల అయి రెండు నెలలు అవుతుండగా.. చడీ చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఈరోజు నుంచే అంటే డిసెంబర్ 22వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మీరూ ఓసారి కుటుంబంతో కలిసి ఈ అద్బుతమైన సినిమాను ఇంట్లోనే చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











