Ravanasura OTT: అనుకున్న డేట్ కంటే ముందే రాబోతున్న రావణాసుర.. ఎప్పుడంటే?
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా సుదీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రావణాసుర. సస్పెన్స్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక మిక్స్ డ్ టాక్ తెచుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా ఆశించిన స్థాయిలో రాబట్టలేదు. ప్రేక్షకులు థియేటర్స్ లో ఈ మూవీ చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఎనిమిది రోజుల్లో కేవలం 11 కోట్ల వరకు మాత్రమే కలెక్ట్ చేసింది.
దీంతో సుమారు 10 కోట్ల నష్టం మూవీకి వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. లాంగ్ రన్ లో క్లోజింగ్ కలెక్షన్స్ ప్రస్తుతం ఉన్నవాటికి ఒక 50 లక్షలు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఒటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ బట్టి మూవీని ఒటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ ఒప్పందం చేసుకున్నట్లు టాక్.

అయితే ఈ మూవీ డిజాస్టర్ కలెక్షన్స్ తో ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో అమెజాన్ ప్రైమ్ లో సినిమాని స్టీమింగ్ చేయడానికి రెడీ అవుతున్నారు. సినిమా హిట్ టాక్ వస్తే మే నెలలో రెండవ వారం రిలీజ్ చేయాలని ముందుగా డిసైడ్ అయ్యారు. కచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుంది అని అంచనా వేశారు. అయితే అనూహ్యంగా ప్రేక్షకులు మూవీని తిరస్కరించడంతో ఇప్పుడు ఏప్రిల్ నెల ఆఖరులో స్ట్రీమింగ్ చేయడానికి అమెజాన్ ప్రైమ్ వారు సిద్ధం అయ్యారంట.
ఇక నిర్మాతకు కొంత ఎమౌంట్ ఇచ్చిన ఓటీటీలో అడ్వాన్స్ రిలీజ్ కు సిద్ధమయినట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబందించిన డేట్ ని కూడా ఎనౌన్స్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. మొత్తానికి రవితేజ కెరియర్ లో విభిన్న కథాంశంతో వచ్చిన సినిమాలు అంతగా సక్సెస్ అయిన దాఖలాలు లేవు. ఇప్పుడు రావణాసుర మరోసారి ఆ ఫీట్ ని కొనసాగింపుగా వచ్చిందనే మాట ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీ షూటింగ్ లో బిజీ అయ్యాడు. ఈ మూవీని దసరా కానుకగా తీసుకొచ్చే ప్లానింగ్ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











