ఓటీటీలో దుమ్మురేపుతున్న మాస్ మహారాజా చిత్రం.. ట్రెండింగ్‌‌లో రవితేజ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్‌లో వచ్చిన ఈగల్ చిత్రం బాక్సాఫీస్ వద్దనే కాకుండా ఓటీటీలో కూడా అత్యధికంగా వ్యూస్ సాధిస్తున్నది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా గత రెండు వారాలుగా ట్రెండింగ్‌గా నిలిచింది. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ రాబట్టుకొంటుందనే వివరాల్లోకి వెళితే..

ఈగల్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని సుమారుగా 45 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలకు భారీ రెస్సాన్స్ రావడంతో బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో నైజాం థియేట్రికల్ హక్కులు 6 కోట్ల రూపాయలకు, ఆంధ్రాలో 11 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సుమారుగా 23 కోట్ల రూపాయలుగా నమోదైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Raviteja s Eagle Movie Trending in Amazon Prime Video and ETV Win Here is the Details

ఇక 46 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ రాబట్టిన ఈ చిత్రాన్ని సుమారుగా 1100 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా మోస్తరుగా నమోదు అయ్యాయి. టెక్నికల్ వ్యాల్యూస్, మేకింగ్ మంచి పేరు వచ్చినా ప్రేక్షకులను భారీగా థియేటర్‌కు రప్పించలేకపోయింది. దాంతో ఈ సినిమా కొంత మేరకు థియేట్రికల్‌గా నష్టాల్లోనే ముగిసింది.

Raviteja s Eagle Movie Trending in Amazon Prime Video and ETV Win Here is the Details

అయితే ఈగల్ సినిమా ఓవరాల్‌గా థియేట్రికల్ రన్‌లో ఏపీ, నైజాంలో 25.5 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కర్ణాటకలో ఈ మూవీ 2.5 కోట్ల గ్రాస్, నార్త్ ఇండియాలో 1.2 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ఓవర్సీస్‌లోను, ఏపీ, తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే భారీగా లాభాలను సాధించలేదని స్పష్టం చేశారు.

ఇక థియేట్రికల్ రిలీజ్‌లో పాజిటివ్‌గా రన్ ముగించుకొని ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ యాప్‌లో ఇటీవల రిలీజై భారీ రెస్సాన్స్ కూడగట్టుకొంటున్నది. ఈ చిత్రం ట్రెండింగ్‌గా, అత్యధిక వ్యూస్ సాధించింది. రెండో వారంలో కూడా ఈ సినిమా వ్యూస్ సాధిస్తూ ముందుకు వెళ్లుందని ట్రేడ్ యూనిట్ వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X