ఓటీటీలోకి రక్తం మరిగించే సినిమా.. ఏకంగా 8 నెలల తర్వాత అందులో!
ఓటీటీ వాడకం పెరిగిన తర్వాత అన్ని భాషల సినిమాలు కొద్ది రోజులకే స్్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. దీంతో ఇలాంటి వాటిపై సినీ అభిమానులు మక్కువ చూపిస్తున్నారు. అయితే, కొన్ని చిత్రాలు మాత్రం రోజులు గడిచినా ఓటీటీలో కనిపించడం లేదు. అలాంటి సినిమాల్లో ఉద్యమం ఆధారంగా రూపొందిన 'రజాకార్' (Razakar) ఒకటి.
బాబీ సింహా, వేదిక ప్రధాన పాత్రల్లో నటించిన సినిమానే 'రజాకార్'. యాతా సత్యనారాయణ తెరకెక్కించిన ఈ మూవీ హైదరాబాద్ నగరంలో జరిగిన రజాకారుల ఉద్యమం నేపథ్యంతో తెరకెక్కిన విషయం తెలిసిందే. దీంతో ఆరభంలోనే ఈ ఉద్వేగభరిత చిత్రం బాగా ఫోకస్ అయింది. అందుకు తగ్గట్లుగానే దీనికి చిత్ర యూనిట్ ప్రమోషన్ చేసింది.

రియల్ స్టోరీతో తెరకెక్కిన 'రజాకార్' సినిమా మంచి అంచనాలను ఏర్పరచుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ రప్పించుకుంది. కానీ ఆడియెన్స్‌ను థియేటర్లకు తీసుకు రావడంలో ఇది విఫలం అయింది. దీతో మంచి రివ్యూలు వచ్చినా కలెక్షన్లను రాణించలేకపోయింది.
హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'రజాకార్' మూవీ 2024 మార్చి 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది జరిగి చాలా రోజులే అవుతున్నా ఈ చిత్రం స్ట్రీమింగ్‌పై ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఈ చిత్రం ఓటీటీ హక్కులను ఫేమస్ సంస్థ ఆహా దక్కించుకుంది. తాజాగా దీనిపై ప్రకటన కూడా చేసింది.

'రజాకార్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌పై తాజాగా ఆహా సంస్థ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా జనవరి 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ మేరకు ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను సైతం విడుదల చేసింది. దీంతో థియేటర్లలో దీన్ని మిస్ అయిన ప్రేక్షకులంతా ఆసక్తిగా చూస్తున్నారు.
ఇదిలా ఉండగా.. 'రజాకార్' చిత్రంలో బాబీ సింహా, వేదికతో పాటు అనసూయ భరద్వాజ్, మకరంద్ దేశ్‌పాండే, రాజ్ అర్జు్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని సమర్‌వీర్ క్రియేషన్స్ బ్యానర్‌పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతాన్ని సమకూర్చాడు.


Click it and Unblock the Notifications











