OTTలోకి రాబోతున్న వణికించే రియల్ థ్రిల్లర్ స్టోరీ.. ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

ఈ మధ్య చాలా మంది ప్రేక్షకులకు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడడం కంటే ఇంట్లోని కూర్చొని కుటుంబ సమేతంగా చూసేందుకు ఇష్టపడుతున్నారు. అవి సినిమాలే అయినా వెబ్ సిరీస్ లు అయినా సరే.. అందరూ కలిసి ఫుల్లుగా చిల్ అవుతూ సంబరంగా చూస్తున్నారు. ముఖ్యంగా థియేటర్లలో విడుదల అయిన చాలా తక్కువ కాలంలోనే సినిమాలు ఓటీటీలోకి రావడంతో మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. ఈక్రమంలోనే ఓటీటీ సంస్థలు కూడా అద్బుతమైన వెబ్ సిరీస్ లను తెరకెక్కిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా మరో రియల్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి రాబోతుంది. ఆ వెబ్ సిరీస్ ఏంటి, ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆయన జీవిత కథఆధారంగా ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి. అయితే తాజాగా మరోసారి ఈయన జీవిత కథను ప్రేక్షుకలకు అందించే ప్రయత్నం చేశారు. మరింత లోతుగా విచారించి మరీ ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అనేక హత్యలు చేసి అడవుల్లోకి పారిపోయి 30 ఏళ్ల పాటు అక్కడే తలదాచుకున్న వీరప్పన్ జీవితం గురించి చాలా వరకు ఈ వెబ్ సిరీస్ లో చూపించారు. ముఖ్యంగా ఒరిజినల్ కథను చూపించబోతున్నారు.

 Real Crime Thriller Koose Munisamy Veerappan Web Series Streaming Details Check Here

ముఖ్యంగా వీరప్పన్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల దగ్గర నుంచి వివరాలు సేకరించి మరీ చిత్రబృందం ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. ఎవరూ చేయనంతగా లోతైనా విచారణ జరిపి మరీ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ అందరినీ అలరిస్తుంది. ఇప్పటి వరకు వీరప్పన్ జీవిత చరిత్రపై చాలానే చిత్రాలు వచ్చినా ఇది అన్నిటికంటే భిన్నంగా ఉంటుందని అర్థం అవుతుంది. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ లో నిజంగానే వీరప్పన్ ను పట్టుకునేందుకు పోలీసు అధికారులు జరిపిన ప్రయత్నాలు, ఆ సమయంలో సేకరించిన విడీయోలను కూడా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

 Real Crime Thriller Koose Munisamy Veerappan Web Series Streaming Details Check Here

త్వరలలోనే కూసే మునుసామి వీరప్పన్ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ప్రీమియంలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. డిసెంబర్ 8వ తేదీ నుంచి అంటే ఈ శుక్రవారం కాకుండా ఆపై వచ్చే శుక్రవారం నుంచి కూసే మునుసామి వీరప్పన్ స్ట్రీమింగ్ కాబోతుందని చిత్రబృందం ఈరోజే ప్రకటించింది. ఇంకెందుకు ఆలస్యం అదిరిపోయే రియల్ క్రైమ్ థ్రిల్లర్ ను ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని చూడండి. పుల్లుగా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X