OTTలోకి రియల్ క్రైమ్ థ్రిల్లర్.. జర్మనీని వణికించిన దీన్ని ఎక్కడ చూడాలంటే?

ఈ మధ్య కాలంలో అనేక థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలు ఓటీటీల్లోకి వస్తున్నాయి. అదిరిపోయే కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా సినీ ప్రియుల అభిరుచికి తగ్గట్లుగా దర్శక, నిర్మాతలు కూడా ఇలాంటి వాటిపైనే ఫోకస్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. అయితే తాజాగా మరో రియల్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ముఖ్యంగా జర్మనీని క్షణ క్షణం భయంకరంగా వణికించిన ఈ స్టోరీ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

క్రైమ్ సీన్ బెర్లిన్: నైట్ లైఫ్ కిల్లర్ అనే సరికొత్త వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేస్తుంది. జర్మనీ దేశంలోని బెర్లిన్ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ముఖ్యంగా జాన్ జాబీల్, కరోలిన్ షాపర్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ను.. కరోలిన్ షాపర్ రచించారు. అలాగే జో బెర్లింగర్, జార్జ్, ఫ్లోరియన్ వంటి వాళ్లు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. బీట్స్ బ్రదర్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ బ్యానర్ పై క్రిస్టియన్ బీట్స్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు.

Real Crime Thriller Series Crime Scene Berlin Night life Killer Streaming Details Here

2012లో క్వీర్ కమ్యూనిటీకి చెందిన ముగ్గురు యువకులు హత్యకు గురికాగా... నాలుగో బాధితుడు హత్య నుంచి ప్రాణాలతో బయట పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది.. హంతకుడు వీరిని ఎందుకు చంపాలనుకున్నాడు, నాలుగో వ్యక్తిని కూడా చంపాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం తెరపై చూడాల్సింద్. ఇప్పటికే రెండు సీజన్లు వచ్చి సూపర్ హిట్ కొట్టగా.. ఇది మూడో సీజన్. దీనిపై పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి.

ఇలా క్షణం క్షణం జర్మనీని వణించిన ఈ రియల్ క్రైమ్ స్టోరీనే తెరకెక్కిస్తుండగా.. ఆంతా ఎగ్జైటింగ్ గా వేచి చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సిరీస్ ను ఎప్పుడెప్పుడు చూస్తామని అని ఉవ్విళ్లూరుతున్నారు. అలాంటి వారి కోసమే ఈ వెబ్ సిరీస్ టీం స్పెషల్ న్యూస్ చెప్పింది. క్రైమ్ సీన్ బెర్లిన్: నైట్ లైఫ్ కిల్లర్ ఎక్కడ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందో వివరించింది.

Real Crime Thriller Series Crime Scene Berlin Night life Killer Streaming Details Here

ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చెప్పింది. అలాగే ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేసింది. ముఖ్యంగా ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదల కాబోతున్నట్లు ప్రకటించింది. ఆద్యంతం ఆకట్టుకునే ఈ వెబ్ సిరీస్ ను ఏప్రిల్ 3వ తేదీ నుంచి చూసేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X