Telugu Indian Idol: సింగర్‌గా వచ్చిన రియల్ ఆర్మీ జవాన్.. సెలెక్ట్ అయినా కూడా రిజెక్ట్ చేయడంతో..

ఓటిపి ఫ్లాట్ ఫామ్ లో మొట్టమొదటిసారిగా ఆహా స్టార్ట్ చేసిన ఇండియన్ ఐడల్ సింగింగ్ షో కు మంచి గుర్తింపు లభిస్తున్న విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు థమన్ ముఖ్య అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఈ సింగింగ్ షోలో గీతామాధురి అలాగే మరో ప్రముఖ సింగర్ కార్తీక్ కూడా జడ్జిలుగా కొనసాగుతున్నారు.

అయితే మొదటి సీజన్ భారీ సక్సెస్ కావడంతో ఇప్పుడు రెండవ సీజన్ కూడా అదే తరహాలో మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ షో ఆడిషన్స్ లోకి ఒక ఆర్మీ జవాన్ రావడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే..

హడావుడి చేసిన థమన్, గీత మాధురి

హడావుడి చేసిన థమన్, గీత మాధురి

ఇండియన్ ఐడల్ సింగింగ్ షోకు మొదటి నుంచి కూడా మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. ఇక రెండవ సీజన్ ను ఆహా మొదలుపెట్టడానికి రెడీ అవుతోంది. నిన్న మొన్నటి వరకు ప్రమోషన్ ఈవెంట్స్ తో కూడా థమన్ గీత మాధురి బాగా హడావిడి చేశారు. ఇక సోషల్ మీడియాలో ఆడిషన్ సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇక మార్చి మూడో తేదీ నుంచి సింగింగ్ షో గ్రాండ్ గా మొదలు కాబోతోంది.

షోలో సింగర్ గా ఆర్మీ జవాన్

షోలో సింగర్ గా ఆర్మీ జవాన్

తెలుగు ఇండియన్ ఐడల్ కు సంబంధించిన ఆడిషన్స్ ను కూడా ఇటీవల మొదలుపెట్టారు. అయితే ఇటీవల ఆడిషన్స్ కు ఏకంగా బిఎస్ఎఫ్ ఆర్మీ జవాన్ రావడం సంగీత దర్శకుడు థమన్ ను అలాగే మిగతా సింగర్స్ ని కూడా ఆశ్చర్యపరిచింది. అతని పేరు చక్రపాణి. ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లో నిత్యం ఒక సైనికుడిగా కొనసాగుతున్నాడు.

థమన్ ప్రశంసలు

థమన్ ప్రశంసలు

అయితే మ్యూజిక్ అనేది నేను ఎక్కడ నేర్చుకోలేదు అని బార్డర్ దగ్గరే అలా సరదాగా పాడుతూ నేర్చుకున్నదే అని వివరణ ఇచ్చాడు. ఇక అతని టాలెంట్ ను చూసి సంగతి దర్శకుడు థమన్ ఎంతగానో మెచ్చుకున్నారు. ఎక్కడ కనీసం మొబైల్ నెట్వర్క్ కూడా లేని ప్రదేశంలో నువ్వు పాటలు నేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయమని అతనిపై ప్రశంసలు కురిపించాడు.

సెలెక్ట్ అయినా నో చెప్పాడు

ఇక తన పాటతో ఎంతగానో మెప్పించిన ఆర్మీ జవాన్ టాలెంట్ ను చూసి మరింత పొగడ్తలతో ముంచెత్తారు. ఇక అతని పాటలు విన్న కార్తిక్ డైరెక్ట్ గా అతన్ని సెలెక్ట్ చేశాడు. కానీ అతను మాత్రం నో అని చెప్పడం జరిగింది. ఎందుకంటే నా సెలవులు అయిపోయాయి అని సరిహద్దుకు వెళ్లిపోవాల్సిన సమయం వచ్చింది అని జవాన్ చక్రపాణి క్లారిటీ ఇవ్వడంతో అందరూ మళ్లీ ఆశ్చర్యపోయారు.

సెల్యూట్ చేసిన థమన్

సెల్యూట్ చేసిన థమన్

నువ్వు మిల్ట్రీ డ్రెస్ లో వచ్చి ఇక్కడ పాడడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే మ్యూజిక్ అనేదానికి కూడా చాలా గొప్ప గర్వకారణం అంటూ అతని ప్రతిభకు థమన్ పాటు గీత మాధురి కార్తీక్ ముగ్గురు కూడా సెల్యూట్ చేశారు. ఇక మీ వాళ్లతో మాట్లాడి ఏదైనా చేయవచ్చా అని కూడా థమన్ మరోసారి రిక్వెస్ట్ చేశారు. మరి చక్రపాణి టాప్ 12 లోకి వెళతాడా లేదా అనేది షో స్టార్ట్ అయినాక తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X