OTT: హరోం హరకు గట్టిదెబ్బే పడిందట..ఓటీటీ రిలీజ్ ఎందుకు ఆగిదంటే? బిగ్ ట్విస్ట్ ఇదేనట!

తెలుగు సినిమా దగ్గర చాలా మంది హీరోలు ఉన్నారు ఇది అందరికీ తెలిసిందే. అయితే వారిలో బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అలాగే స్వయం కృషితో కూడా పైకి వచ్చినవారు కూడా ఉన్నారు. కాగా బ్యాక్గ్రౌండ్ ఉండి మంచి టాలెంట్ ఉండి కూడా కొందరికి మాత్రం సినిమాలు కలిసి రావు. వారు ఎంత కష్టపడినా వారి కష్టం వృథా అవుతుంది కానీ ఆ సినిమా హిట్ అవ్వడం అరుదైపోయింది.

అలాంటి అండర్ రేటెడ్ టాలెంటెడ్ హీరోస్ లో సుధీర్ బాబు కూడా ఒకరని చెప్పడంలో సందేహం లేదు. కాగా సుధీర్ బాబు ఇప్పుడు వరకు చేసిన సినిమాల్లో హిట్స్ జస్ట్ కొన్నే.. కానీ తాను మంచి ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతాడు. అలా రీసెంట్ గా తాను చేసిన భారీ చిత్రమే "హరోం హర". దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారకా తెరకెక్కించిన ఈ చిత్రం ఒక గ్యాంగ్ స్టర్ డ్రామాగా కేజీయఫ్, పుష్ప తరహా సినిమాల్లా తనకి ఇది ప్లాన్ చేశారు.

Reason behind why sudheer babu s harom hara ott release got stopped

కానీ చూసిందే ఎన్ని సార్లు చూడాలని ఆడియెన్స్ మొహం చాటేయడంతో కొన్ని సీన్స్ మ్యూజిక్ వంటివి బాగున్నప్పటికీ ఈ చిత్రం మిస్ ఫైర్ అయ్యింది. సరే ఓటిటి లో అయినా చూద్దాం అని కొందరు అనుకున్నారు. ప్రముఖ ఓటిటి సంస్థలు ఆహా, ఈటీవీ విన్ లో ఈ జూలై 11 నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ కి రావాల్సి ఉంది. కానీ ట్విస్ట్ ఇస్తూ ఈ రెండిట్లో కూడా సినిమా అందుబాటులోకి రాలేదు.

అయితే అసలు ఇలా ఎందుకు ఆగిపోయిందో ఇప్పుడు కారణం బయటకి వచ్చింది. ఇటీవల చైల్డ్ అబ్యూస్ కేసులో సంచలనంగా మారిన యూట్యూబర్ ప్రణీత్ హన్మంతు కోసం తెలిసిందేగా.. అతడి వల్ల ఈ సినిమా ఓటిటిలో ఆగిపోయిందట. కాగా ఇతడు ఈ సినిమాలో కూడా నటించాడు. టాలీవుడ్ యంగ్ హీరోస్ అంతా అతడి విషయంలో తీసుకున్న స్టాండ్ సమయంలో హీరో సుధీర్ బాబు కూడా నిలిచాడు.

Reason behind why sudheer babu s harom hara ott release got stopped

ఇలాంటి వాడిని నా సినిమాలో పెట్టుకున్నందుకు సిగ్గు పడుతున్నాను అని అతడికి శిక్ష పడాలి అని ఇలాంటి వాణ్ణి తన సినిమాలో పెట్టుకున్నందుకు అందరూ నన్ను క్షమించండి అని ఇలాంటివి మళ్ళీ తన సినిమాతో రిపీట్ కాకుండా చూసుకుంటానని తెలిపాడు. మరి ఇదే ఇప్పుడు హరోం హర రాకపోవడానికి అసలు కారణమట.

అతను ఉండడం వల్ల ఓటిటి సంస్థలకి బ్యాడ్ నేమ్ వస్తుందన్న ఉద్దేశంతో అతని సీన్స్ కట్ చేసి ఎడిటెడ్ వెర్షన్ ఐ తర్వాత విడుదల చేస్తారని తెలుస్తుంది. దీంతో ఆన్ టైం ఓటిటిలో రిలీజ్ కి రావాల్సిన ఈ సినిమా విడుదల ఆగిపోయింది. మరి కొత్త డేట్ ఏంటి ఎప్పుడు అనే వివరాలు మున్ముందు రానున్నాయి. కాగా ఈ చిత్రంలో మాల్వికా శర్మ హీరోయిన్ గా నటించగా సునీల్, కేజీయఫ్ ఫేమ్ లక్కీ లక్ష్మణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

More from Filmibeat

Read more about: sudheer babu malvika sharma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X