OTTలోకి 'ప్రభాస్ కల్కి' తరహా సరికొత్త సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్.. ఎందులో చూడాలంటే?
ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ప్రాజెక్ట్ కె కల్కి కూడా ఒకటి. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రయోగాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో లేదో తెలీదు కానీ మేకర్స్ ఈ చిత్రం అద్భతం సృష్టిస్తుందని చెబుతున్నారు. అయితే ఈ సినిమాను చాలా మంది హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలతో పోలుస్తున్నారు. కానీ ఇది ఏ చిత్రంతో పోల్చదగేది కాదని, అంతకుమించి అని మూవీటీమ్ చెబుతోంది. సరే ఈ విషయం పక్కనపెడితే తాజాగా ఓ సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ సినిమా వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇందులో ఒక్కో సీన్ గూస్ బంప్స్ తెప్పించే రేంజ్లో యాక్షన్ సీన్స్ ఉంటాయట. పూర్తి వివరాలు స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం.
ఓటీటీలోకి డిఫరెంట్ జాన్సర్లో సరికొత్త చిత్రాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అందులో చాలా వరకు బాగానే ఆకట్టుకుంటుంటాయి. మంచి టైమ్ పాస్‌ను ఇస్తాయి. అయితే కొంతమంది ఆడియెన్స్ ప్రత్యేకంగా హాలీవుడ్ సినిమాలను మాత్రమే ఎక్కువగా చూస్తుంటారు. అలాంటి వారికి రెబల్ మూన్ : ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ మూవీ గురించి దాదాపుగా తెలిసే ఉంటుంది. దీనిని ప్రముఖ దర్శకుడు జాక్ స్నైడర్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గత సంవత్సరం నేరుగా ఓటీటీలో రిలీజై ఆడియెన్స్‌ను మెప్పించింది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లోకి వచ్చి భారీ వ్యూస్‌ను దక్కించుకుంది.

ఈ సినిమా కేవలం ఇంగ్లిష్‌లోనే కాదు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ వెర్షన్స్‌లోనూ సూపర్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ప్రకటించారు. చెప్పినట్టుగానే రెబెల్ మూన్- పార్ట్ 2 : ది స్కార్ గివర్ను తెరకెక్కించారు. ఇప్పుడు దీనిని కూడా తొలి భాగం తరహాలోనే నేరుగా ఓటీటీలోకి వదలనున్నారు. పార్ట్ 1ను తెరకెక్కంచిన జాక్ స్నైడరే ఈ పార్ట్ 2ను కూడా తెరకెక్కించారు. ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ రెబెల్ మూన్ పార్ట్ 2 చిత్రం వచ్చే నెలలో వచ్చేందుకు సిద్ధమైంది.
ఏప్రిల్ 19న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇది కూడా ఇంగ్లిష్తో పాటు హిందీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ తమ సోషల్ మీడియా పేజీలో అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఇది నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన ఒరిజినల్ మూవీ.
ఈ చిత్రంలో ఎడ్ స్క్రీన్, సోఫియా బౌటెల్ల, చార్లీ హున్నామ్, మైఖేల్ హ్యూస్‌మన్, స్టాజ్ నాయర్, షార్లెట్ మాగీ, బే డూనా తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మరో విషయమేమిటంటే ఇందులో ఎలాంటి అడల్డ్ సీన్స్ కూడా లేవట. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఎంచక్కా మీ ఫ్రీ టైమ్‌లో ఈ సినిమా చూసేయండి..


Click it and Unblock the Notifications











