For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RECCE web series స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు.. రెక్కీ వెబ్ సిరీస్ కథ ఏమిటంటే?

  |

  ప్రముఖ టెలివిజన్, ఓటీటీ సంస్థ ZEE5 కేవలం OTT ప్లాట్‌ఫాం మాత్రమే కాదు. ఇది అంతకంటే ఎక్కువ. కంటెంట్ పరంగా ఇది ఎల్లప్పుడూ అత్యుత్తమంగా ఉంటుంది. ZEE5 కంటెంట్ పరంగా చూస్తే ఎన్నో మిలియన్ల మంది హృదయాల ఆదరణతో దూసుకుపోతుంది. ZEE5 ఒక జోనర్‌కు మాత్రమే పరిమితం కాకుండా, వివిధ ఫార్మాట్‌లకు ప్రసారం చేసే విధంగా సినిమా, వెబ్ సిరీస్ ఇలా అన్ని రకాల జోనర్స్ ను వీక్షకులకు అందించనుంది. ఇటీవలే ZEE5 లో వచ్చిన వెబ్ సిరీస్ గాలివాన హిట్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు వీక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు ZEE5 కొత్త వెబ్ సిరీస్‌ను ప్రారంభించడానికి సిద్ధమైంది

  ZEE5 విడుదల చేసిన మోషన్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంది. ఈ ఉత్కంఠకు తెరదింపుతూ ZEE5 వారు రెక్కీ అనే క్రైమ్ థ్రిల్లర్‌ను వెబ్ సిరీస్ ప్రకటించింది. ఇది జూన్ 17 నుంచి
  స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ 1990ల నాటి గ్రిప్పింగ్ పీరియడ్ థ్రిల్లర్. కథ 7 ఎపిసోడ్‌లుగా ఒక్కొక్కటి 25 నిమిషాల నిడివి ఉంటుంది.

  RECCE web series stream from June 17 on Zee5 OTT platform. Sriram and Shiva Balaji are lead roles.

  ఈ సందర్భంగా దర్శకుడు పోలూరు కృష్ణ ఈరోజు మాట్లాడుతూ.. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ హత్య చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో ఎన్నో ఉత్కంఠభరితమైన సంఘటనలతో వీక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది..కొత్తగా నియమించ బడిన లెనిన్ అనే సబ్ ఇన్‌స్పెక్టర్ "రెక్కీ" లో ఎక్సపెర్ట్ అయిన పరదేశి మధ్య ఈ కథ నడుస్తుంది. 1992లో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ వరదరాజులు హత్యకు ఎలా ప్లాన్ చేశారు.ఇన్స్పెక్టర్ లెనిన్ ఈ కేసును ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి చేదించాడు అనేది కథ యొక్క ప్రధానాంశం.

  మోషన్ పోస్టర్ లోని "రెక్కీ" అప్పిరియన్స్ చూస్తుంటే, ''ఇందులో ఉత్కంఠభరితమైన డ్రామా తో పాటు ఉత్తేజకరమైన ట్విస్ట్ & టర్న్‌లతో సుసంపన్నమైన రోలర్-కోస్టర్ రైడ్ లా కనిపిస్తుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌ లో వస్తున్న ఈ వెబ్ సిరీస్ మరింత ఉత్కంఠ రేపుతోంది. తాడిపత్రిలో పేరుమోసిన ఫ్యాక్షన్ హింస అంశం చుట్టూ అన్వేషించబడినట్లు కనిపిస్తోంది. చలనచిత్రాలు మరియు ఇతర పాప్ సంస్కృతి దృగ్విషయాల ద్వారా, మనకు ఉన్నత స్థాయి ఫ్యాక్షన్ నాయకుల హత్యల గురించి మాత్రమే తెలుసు. అయితే 'రెక్కీ'వెబ్ సిరీస్ ద్వారా ఒక ఘోరమైన సంఘటనల వెనుక దాగివున్న విషయాల వెలికి తీస్తుంది. ఈసీరీస్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎలా ఉండబోతుందో ప్లాట్ వివరణ సూచిస్తుంది. "90వ దశకం ప్రారంభంలో తాడిపత్రిలో, రూకీ సబ్-ఇన్‌స్పెక్టర్ లెనిన్‌కు అక్కడ జరిగిన జంట హత్యలను ఛేదించే పనిని అప్పగిస్తారు. ఈ హంతకులు రాజకీయంగా ప్రేరేపించబడ్డారా, కక్ష పూరితంగా చేసిందా లేక అంతకంటే చీకటి కోణం ఏమైనా ఉందా? అనే విషయాలను లెనిన్ పరిశోధనతో కొన్ని అనూహ్య కరమైన రహస్యాలను కనుగొనేలా చేస్తుంది.

  శ్రీరామ్, శివ బాలాజీ ఇంతవరకూ చేయని పాత్రలు ఇందులో చేశారు. సీరీస్‌లోని ప్రధాన భాగాలను అనంతపురంలో చిత్రీకరించారు. దర్శకుడు మరియు ఇతర సాంకేతిక నిపుణులు ఈ సిరీస్‌ కథను ఓన్ చేసుకొని ప్రేక్షకులకు వాస్తవికమైన సంఘటనలను వివరించడం జరిగింది. గ్రామీణ ఫ్యాక్షన్ క్రైమ్ డ్రామా తో వస్తున్న ఇలాంటి కథలు ప్రేక్షకులు చూసి చాలా కాలం అయ్యింది కాబట్టి, వీక్షకులకు ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా నచ్చుతుంది.

  నటీనటులు- పాత్రలు:
  శ్రీరామ్: లెనిన్
  శివ బాలాజీ: చలపతి
  ధన్య బాలకృష్ణ: గౌరీ
  ఆడుకలం నరేన్: వరదరాజులు
  రేఖ: ఎస్టర్ నోరోన్హా
  ఎమ్మెల్యే : జీవా
  శరణ్య ప్రదీప్: బుజ్జమ్మ
  రాజశ్రీ నాయర్: దేవకమ్మ
  రామరాజు: రంగనాయకులు
  తోటపల్లి మధు: కుళ్లాయప్ప
  సమీర్: పోలీస్ ఆఫీసర్
  సమ్మెట గాంధీ: పరదేశి
  ఉమా దానం కుమార్: బాషా
  కృష్ణకాంత్: సుబ్బడు
  మురళి: బసవ
  సూర్య తేజ: E.O
  మణి: నల్లంజీ
  కోటేశ్వర్ రావు: ఎస్పీ సంజయ్
  స్వామి నాయుడు: కానిస్టేబుల్ స్వామి
  ప్రభావతి: కానిస్టేబుల్ స్వామి భార్య

  సాంకేతిక నిపుణులు:
  దర్శకుడు: పోలూరు కృష్ణ
  కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కృష్ణ పోలూరు
  నిర్మాత: శ్రీ రామ్ కొలిశెట్టి
  ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శ్రీకాంత్ పోలూరు
  ప్రొడక్షన్ హౌస్: సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్
  డీవోపీ: రామ్. కే మహేష్
  సంగీతం: శ్రీరామ్ మద్దూరి
  యాక్షన్: రాంబాబు
  సౌండ్ డిజైనర్: సాయి
  ఎడిటర్: కుమార్. పి. అనిల్
  ఆర్ట్ డైరెక్టర్: కార్తీక్ అమ్ము, బాబు
  కాస్ట్యూమ్ డిజైనర్: శ్రావ్య పెద్ది
  ప్రొడక్షన్ మేనేజర్: రాజేష్ మట్ట
  ప్రొడక్షన్ డిజైనర్: ఝాన్సీ. లింగం & నాని
  V.F.X సూపర్‌వైజర్: పోలోజు విష్ణు

  English summary
  RECCE web series stream from June 17 on Zee5 OTT platform. Sriram and Shiva Balaji are lead roles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X