డైరెక్ట్‌గా OTTలోకి వచ్చేసిన రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్.. మంకీ మ్యాన్ సినిమాను ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ సినిమాల హవా బాగా పెగిరిపోయింది. ఎవరు చూసినా అలాంటి చిత్రాలనే ఇష్టపడుతుండడంతో దర్శక, నిర్మాతలు కూడా అలాంటి చిత్రాలనే రూపొందిస్తున్నారు. అయితే ఇటీవలే వచ్చిన ఓ సూపర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చిఅందరికీ సర్ ప్రైజ్ ఇచ్చింది. ముఖ్యంగా భారతీయులు ఎంతో ఇష్టంగా చూడాలనుకున్న ఈ సినిమా పలు కారణాల వల్ల థియేటర్లలో విడుదల కాలేకపోయింది. కానీ తాజాగా ఓటీటీలోకి రావడంతో అంతా ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ సినిమాను చూసేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన తాజా చిత్రమే మంకీ మ్యాన్. దేవ్ పటేల్ దర్శకత్వం వహించారు. అలాగే సహ నిర్మాతగా కూడా ఉన్నారు. అయితే ఈ సినిమాలో దేవ్ పటేల్, షార్ల్టో కోప్లీ, పిటోబాష్ త్రిపాఠి, విపిన్ శర్మ, సికందర్ ఖేర్, అదితి కల్కుంటే, అశ్విని కల్సేకర్, మకరంద్ దేశ్‌పాండే, జతిన్ మాలిక్ జాకీర్ హుస్సేన్ నటించారు. వీళ్లు మాత్రమే కాకుండా అచ్చమైన తెలుగు అమ్మాయి శోభితా దూళిపాళ్ల కూడా ఈ సినిమాలో నటించింది.

ఈ చిత్రాన్ని మొదటగా.. అంటే మార్చి 11వ తేదీన సౌత్ బై సౌత్ వెస్ట్‌లో ప్రదర్శించారు. అలాగే ఏప్రిల్ 5వ తేదీ 2024న యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా యునైటెడ్ స్టేట్స్, కెనడాలో థియేటర్‌ల్లో కూడా విడుదల చేశారు. కానీ ఈ చిత్రాన్ని తెలుగులో మాత్రం విడుదల చేయలేకపోయారు. దీంతో చాలా మంది సినీ ప్రియులు అప్ సెట్ అయ్యారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికోసమే అన్నట్లుగా ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రస్తుతం మంకీ మ్యాన్ చిత్రం రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆపిల్ టీవీలో కూడా స్ట్రీమింగ్ ఇవుతుంది. ఇలా రెండు ఓటీటీల్లో ఒకేసారి అందుబాటులోకి చాలా మంది ఈ చిత్రాన్ని చూస్తూ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. ఈ సినిమా అప్ డేట్ల గురించి తెలియని చాలా మంది దీని వారి పోస్టుల కింద లింకులు పెట్టమంటూ.. ఎక్కడ అందుబాటులో ఉందో చెప్పమంటూ అడుగుతున్నారు. ఇలా వివరాలు సేకరించుకుని మరీ ఈ సినిమాను చూసేస్తున్నారు.

మీరు కూడా అదిరిపోయే ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని ఓటీటీలో చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. ముఖ్యంగా ఆంజనేయ స్వామి స్ఫూర్తితో తీసిన ఈ సినిమాలో హీరో ఓ అమ్మాయిని కాపాడేందుకు.. ఎవరెవరిని అడ్డుకుంటాడు.. అసలు ఏం చేస్తాడనేది అసలు కథ. మీరు కూడా ఓసారి ఈ సినిమాను చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











