OTTలోకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హార్రర్ మిస్టరీ మూవీ.. ఎక్కడ, ఎప్పటి నుంచి చూడాలంటే?

ఈ మధ్య కాలంలో అనేక అదిరిపోయే సినిమాలు వెంటనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. థియేటర్లలోకి వచ్చి సూపర్ డూపర్ హిట్లుగా నిలిచిన సినిమాలు కూడా నెల తిరక్కముందే ఓటీటీలోకి వస్తుండగా.. తాజాగా మరో అదిరిపోయే సినిమా ఓటీటీలోకి రాబోతుంది. బాక్సాఫీసు వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఏంటి, ఎప్పటి నుంచి ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా.. సూర్య భార్య జ్యోతిక హీరోయిన్ గా వచ్చిన తాజా సినిమానే షైతాన్. అద్భుతమైన మిస్టరీ హార్రర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా జ్యోతిక ఈ సినిమాతోనే బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వగా.. మార్చి 8వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దేవగన్ ఫిల్మ్స్ , జియో స్టూడియోస్ మరియు పనోరమా స్టూడియోస్ నిర్మించాయి.

Recent Biiggest Block Buster Hif Film Shaitaan OTT Streaming Details Here

అజయ్ దేవగన్, జ్యోతికలు హీరోహీరోయిన్లుగా చేసిన ఈ సినిమాలో మాధవన్, జాంకీ బోడివాలా, అంగద్ రాజ్, పాలక్ లాల్వాణీ, మనోజ్ ఆనంద్, రిచా ప్రకాష్, హితేన్ పటేల్, రోష్ని కౌర్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. అమిత్ త్రివేది సంగీతం అందించగా.. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే దీప్ ఫ్రాన్సిసి ఎడిటర్ గా పని చేశారు. 65 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు రూ.167.32 కోట్లు కలెక్షన్లు వచ్చాయి.

విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ముఖ్యంగా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్.. షైతాన్ సినిమా హక్కులను భారీ ధరకు దక్కించుకుంది. భారీ పోటీ మధ్య ఈ సినిమా హక్కులు పొందిన నెట్ ఫ్లిక్స్.. ఈ చిత్రం విడుదల అయిన 45 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

Recent Biiggest Block Buster Hif Film Shaitaan OTT Streaming Details Here

ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమా వచ్చే నెల చివర్లో కచ్చితంగా విడుదల అవుతుందని అంతా భావిస్తున్నారు. ఇలా అంతా అనుకున్నట్లుగా వచ్చే నెల చివరి వారంలో ఈ సినిమా విడుదల అయితే ఓటీటీ ప్రియులు అంతా కచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే. ఎంజాయ్ చేయాల్సిందే. ప్రతీక్షణం నరాలు తెగే ఉత్కంఠను కల్గించే ఈ చచిత్రాన్ని అస్సలే మిస్ కాకండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X