OTTలోకి జ్యోతిక రీసెంట్ హార్రర్ మూవీ.. 200 కోట్లు వసూలు చేసిన ఈ సినిమాను ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య కాలంలో అందరూ హార్రర్, థ్రిల్లర్, కామెడీ మూవీలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆ విషయం అర్థం చేసుకున్న దర్శక, నిర్మాతలు కూడా అలాంటి చిత్రాలనే తీసుకు వస్తూ.. బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నారు. అయితే తాజాగా ఓ అదిరిపోయే హార్రర్ మూవీ విడుదల అయింది. బాక్సాఫీసు వద్ద దాదాపు 200 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది వంటి విషయాలన మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రమే షైతాన్. అదిరిపోయే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో సూర్య భార్య జ్యోతిక హీరోయిన్ గా నటించి మెప్పించింది. తొలిసారి ఆమె ఈ చిత్రంతోనే బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వగా.. మొదటి చిత్రమే సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. దీంతో జ్యోతిక రేంజ్ మరింతగా పెరిగిపోయింది. ముఖ్యంగా మార్చి 8వ తేదీన థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమాకు వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు.

అలాగే దేవగన్ ఫిల్మ్స్ , జియో స్టూడియోస్ మరియు పనోరమా స్టూడియోస్ సంయుక్తంగా షైతాన్ సినిమాను నిర్మించాయి. అజయ్ దేవగన్, జ్యోతికలు హీరోహీరోయిన్లుగా చేసిన ఈ సినిమాలో మాధవన్, జాంకీ బోడివాలా, అంగద్ రాజ్, పాలక్ లాల్వాణీ, మనోజ్ ఆనంద్, రిచా ప్రకాష్, హితేన్ పటేల్, రోష్ని కౌర్ వంటి వాళ్లు కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే ఈ చిత్రానికి అమిత్ త్రివేది మెస్మరైజింగ్ మ్యూజిక్ అందించారు. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. అలాగే దీప్ ఫ్రాన్సిసి ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించారు.
65 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు రూ.208.4 కోట్లు కలెక్షన్లు రాగా... బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇంత పెద్ద హిట్ గా నిలిచిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో రాబోతుంది. ముఖ్యంగా ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే సినిమా విడుదల అయిన తర్వాత 45 రోజుల అనంతరం ఈ సినిని డిజిటల్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది.

మే 3వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు సమాచారం. హార్రర్ చిత్రాలు ఇష్పడే ప్రతీ ఒక్కరూ.. ఈ సినిమాను కచ్చితంగా చూడాల్సిందే. అనుక్షణం అలరించే ఈ అద్భుతమైన సినిమాను ఫ్యామిలీతో కలిసి మరీ ఓటీటీ వేదికగా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. ప్రతీక్షణం నరాలు తెగే ఉత్కంఠను కల్గించే ఈ చిత్రాన్ని అస్సలే మిస్ కాకండి.


Click it and Unblock the Notifications











