OTTలోకి రీసెంట్ మిస్టరీ థ్రిల్లర్.. రూ.200 కోట్లు రాబట్టిన ఈ సినిమాను ఎక్కడ చూడాలంటే?
సమ్మర్ అలా వచ్చిందో లేదో ఇలా అద్భుతమైన సినిమాలు వస్తూ... సినీ ప్రియులను తెగ అలరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతీ వారం అటు థియేటర్లతో పాటు ఇటు ఓటీటీలోనూ సరికొత్త చిత్రాలు సందడి చేస్తున్నాయి. అందులో ఎక్కువగా ఇప్పుడు హార్రర్, మిస్టరీ, థ్రిల్లర్ చిత్రాలదే హవా కొనసాగుతోంది. అయితే ఇటీవలే వచ్చిన ఓ బ్లాక్ బస్టర్ హిట్ ఫిల్మ్, మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఆ సనిమా ఏంటి, ఎక్కడ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది వంటి వివరాలను మనం ఇప్పుడు తెలుసకుందాం.
మలయాళ భషలో తెరకెక్కిన రీసెంట్ మిస్టరీ థ్రిల్లర్ మంజుమ్మల్ బాయ్స్ గురించి దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు అందరికీ తెలుసు. అద్భుతమైన కథాశంతో వచ్చిన ఈ సినిమా కోలీవుడ్ లోల బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా అక్కడి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా మిగతా భాషల్లోకి కూడా డబ్ అవుతుంది. అయితే చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పరవ ఫిల్మ్స్ నిర్మించారు.

ఈ సినిమాలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్. పొదువాల్, లాల్ జూనియర్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరుణ్ కురియన్, ఖలీద్ రెహమాన్, చందు సలీంకుమార్, షెబిన్ బెన్సన్, మరియు విష్ణు రేఘు తదితరులు నటించారు. 2006లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 22వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది.
విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 200 కోట్ల కంటే ఎక్కువ వసూళ్లు సాధించిన సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా అత్యధిక వసూళ్లు చేసిన మూడో భారతీయ చలనచిత్రంగా నిలిచింది. అయితే అదిరిపోయే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను ప్రస్తుతం తెలుగులోకి కూడా డబ్ చేస్తున్నారు.

ఇదంతా ఇలా ఉండగా.. ఈ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఓటీటీ వేదికగా వచ్చేందుకు సిద్ధం అవుతుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకే దక్కించుకుంది. భారీ పోటీ మధ్య హక్కులు కొనుగోలు చేసిన ఈ సంస్థ.. మంజుమ్మల్ బాయ్స్ చిత్రాన్ని ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. మరికొన్ని రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్న ఈ సినిమాను ప్రతీ ఒక్కరూ కచ్చితంగా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











