OTTలోకి రీసెంట్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్.. అత్యధిక వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ ప్రియులు తెగ సంబురపడిపోయే ఓ సర్ ప్రైజింగ్ మూవీని ఓటీటీలోకి వచ్చేసింది. ముఖ్యంగా 2024 సంవత్సరం అంటే ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తుంది. ఇలాంటి అద్భుతమైన సినిమాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా చూడాలనుకుంటున్నారు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం ఈ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రీసెంట్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ డూన్: పార్ట్ టూ గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా డెనిస్ విల్లెనెయువ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆయనే నిర్మించారు. డూన్ చిత్రానికి ఈ సినిమా సీక్వెల్. ఫ్రాంక్ హెర్బర్ట్ రచించిన 1965 నవల ఆధారంగా ఈ సినిమాలను తెరకెక్కించారు. ఆస్టిన్ బట్లర్, ఫ్లోరెన్స్ పగ్, క్రిస్టోఫర్ వాల్కెన్, జెండయా, జోష్ బ్రోలిన్, తిమోతీ చలమెట్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

ఈ సినిమాకు గ్రీగ్ ఫ్రేజర్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయగా.. జో వాకర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. అలాగే హాన్స్ జిమ్మర్ మ్యూజిక్ అందించగా.. మార్చి ఒకటవ తదీన ఈ సినిమా యునైటెడ్ స్టేట్స్ లో రిలీజ్ అయింది. సినిమా విడుదల అయిన అతి తక్కవ కాలంలోనే బాక్సాఫీసును షేర్ చేసిందీ చిత్రం. ముఖ్యంగా 190 మిలియన్ డాలర్లతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 634.4 మిలియన్ డాలర్లను వసూళ్లు చేసి ట్రెండ్ సెట్ చేసింది.
ఇలా అదిరిపోయే కాన్సెప్ట్ తో వచ్చి అందిరనీ తెగ అలరించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అలా అని ఈ చిత్రాన్ని అందరూ చూడొచ్చని అనుకుంటున్నారేమో. అది అస్సలే కుదరదండి. ఎందుకంటే ఈ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కేవలం రెంటల్ విధనానంలో మాత్రమే అందుబాటులో ఉంది. కచ్చితంగా ఈ సినిమా చూడాలనుకునే వాళ్లు డబ్బులు చెల్లించి ఈ చిత్రాన్ని చూడాలి.

గత కొంత కాలంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఇదే పద్ధతిని ఫాలో అవుతుంది. ముఖ్యంగా సూపర్ డూపర్ హిట్ చిత్రాలను ముందుగా రెంటల్ విధానంలో అందుబాటులో ఉంచి.. ఆ తర్వాత కొంత కాలానికి ఫ్రీగా స్ట్రీమింగ్ చేస్తుంది. డబ్బులు చెల్లించలేని వారు మరికొంత కాలం ఆగితే చాలు.. ఈ డూన్: పార్ట్ టూ ను ఫ్రీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగానే చూసేయెచ్చు.


Click it and Unblock the Notifications











