సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ హిట్ ఫిల్మ్.. 100 కోట్లు రాబట్టిన ఈ మూవీ ఎక్కడ చూడాలంటే?

ఈ మధ్య కాలంలో అనేక అద్భుతమైన హిట్ సినిమాలు ఓటీటీలోకి వస్తూ సందడి చేస్తున్నాయి. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు అందరి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు ప్రతీ వారం వస్తుండగా.. మరో బాలీవుడ్ స్టార్ హీరో సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. చడీ చప్పుడు లేకుండా వచ్చేసిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టడం గమనార్హం. అయితే ఆ సినిమా ఏంటి ప్రస్తుతం ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్ గా ఇటీవలే వచ్చిన రొమాంటిక్ కామెడీ మూవీయే "తేరీ బాతోన్ మే ఐజా ఉల్జా జియా". మాడాక్‌ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై దినేష్‌ విజన్ నిర్మించిన ఈ సినిమాకు అమిత్‌ జోషి, ఆరాధనా సాహ్ దర్శకత్వం వహించారు. అలాగే ధర్మేంద్ర, డింపుల్ కపాడియా, షాహిద్‌ కపూర్‌, కృతి సనన్, ఆశిష్ వర్మ, అనుభ ఫతేపురా, రాకేష్ బేడి వంటి ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.

Recent Bock Buster Hit Film Teri Baaton Mein Aisa Uljha Jiya OTT Streaming Details

రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. మొదట్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆ తర్వాత సత్తా చాటింది. బాక్సాఫీసు బద్ధలు అయ్యేలా కలెక్షన్లు వసూలు చేసింది. ఇలా మొత్త రూ.130 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సైలంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.

సినిమా విడుదల అయిన నెలన్నర రోజులలోపే ఈ సినిమా ఓటీటీలోకి రావడంతో అంతా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా ఎలాంటి ముందస్తు అధికారిక ప్రకటన లేకుండా డిజిటల్ వేదికగా స్ట్రీమింగ్ కావడం చూసి నోరెళ్లబెడుతున్నారు. వెంటనే తేరుకుని ఈ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చూసేస్తున్నారు కూడా. అయితే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.

Recent Bock Buster Hit Film Teri Baaton Mein Aisa Uljha Jiya OTT Streaming Details

అలా అని ఎవరు పడితే వీళ్లు ఈ సినిమాను చూడలేరు. ఎందుకు అనుకుంటున్నారా... ఈ సినిమా కేవలం రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంది. మరికొన్ని రోజుల్లో ఫ్రీగా చూసే అవకాశం కూడా కల్పించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గత కొంత కాలంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఇదే పద్ధతిని ఫాలో అవుతుంది. ముందుగా రెంటల్ విధానంలో చూపించి.. కొంత కాలం గడిచాకా ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేలా చేస్తుంది. ముందుగానే చూడాలనుకున్న వాళ్లు రెంటల్ ద్వారా చూసి కాస్త ఆలస్యం అయినా ఫర్వాలేదు అనుకుంటే మాత్రం మరికొంత కాలం ఆగి చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X