OTTలోకి బోల్డ్ కంటెంట్ మూవీ.. పాతికేళ్ల అబ్బాయితో 40 ఏళ్ల మహిళ ఘాటు రొమాన్స్.. ఎలా చూడాలంటే!
ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా ఎక్కువ అయిపోయింది. ముఖ్యంగా హార్రర్, క్రైమ్, కామెడీ, రొమాంటిక్ చిత్రాలను చూసే వాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అసలే సమ్మర్ కావడం, అందులోనూ ఇందులో ఎక్కువగా ఎండలు ఉండడంతో అంతా ఇంట్లోనే కూర్చుని మరీ సినిమాలు చూస్తున్నారు. ముఖ్యంగా తమకు భాష రాకపోయినా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చిత్రాలను చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఓటీటీలో అనేక బోల్డ్ కంటెంట్ సినిమాలు ఉండగా.. మరో క్రేజీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా 40 ఏళ్ల వయసు కల్గిన ఓ యువతి భర్త చనిపోవడంతో తన కూతురును పెంచుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే తనకు 24 కుర్రాడితో పరిచయం ఏర్పడుతుంది. అదికాస్తా ప్రేమకు దారి తీయగా.. ఆ తర్వాత వారు శారీరకంగా ఒక్కటి అవుతారు. ఇలా అద్భుతమైన కథాంశంతో వచ్చిన ఈ క్రేజీ రొమాంటిక్ కామెడీ మూవీ పేరే "ది ఐడియా ఆఫ్ యు". అయితే హాలీవుడ్ లో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ల వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.

రాబిన్ లీ రాసిన నవల ఆధారంగా ఈ మూవీకి మైఖేల్ షోల్టర్ దర్శకత్వం వహించారు. అన్నే హాత్వే, నికోలస్ గలిట్జైన్ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ చిత్రం సౌత్ బై సౌత్‌వెస్ట్‌లో మార్చి 16వ తేదీన ప్రదర్శించారు. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్న ఈ చిత్రానికి బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు వచ్చాయి. సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవతుంది.
బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చిందని తెలిసినప్పటి నుంచి అంతా ఫుల్ ఎగ్జైట్ అవుతూ చిత్రాన్ని చూసేస్తున్నారు. అయితే అన్ని సినిమాల మాదిరి ఫ్యామిలీతో కలిసి కూర్చుని చూసే చిత్రం మాత్రం కాదిది. ఒంటరిగానో లేదంటే భార్య, భర్త, ప్రేమికుడు, ప్రేమికురాలితో మాత్రమే చూడాలి. లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సుమీ. మరి ఇంకా ఎందుకు ఆలస్యం.. ఓటీటీలో ట్రెండ్ సెట్ చేస్తున్న ఈ రక్రేజీ రొమాంటిక్ చిత్రాన్ని మీరు కూడా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











