OTTలోకి కామెడీ అడ్వెంచర్ ఫిల్మ్.. థ్రిల్ అవుతూ ఎంజాయ్ చేయాలంటే పక్కా చూడండి!
ఈ మధ్య కాలంలో ఏ భాషలో సినిమా వచ్చినా అది వెంటనే ఇతర భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతూ.. ఓటీటీ ప్రియులను తెగ అలరిస్తున్నాయి. ముఖ్యంగా మంచి టాక్ వచ్చిన చిత్రాలు, హిట్ చిత్రాలు అయితే కచ్చితంగా ఇతర భాషల్లోనూ విడుదల అవుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే తాజాగా కన్నడలో వచ్చిన ఓ సూపర్ కామెడీ అడ్వెంచర్ ఫిల్మ్ ఓటీటీలోకి రాబోతుంది. సినిమా విడుదల అయి నెలన్నర కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చి సందడి చేసేందుకు సిద్ధం అయింది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కన్నడలో ఇటీవలే విడుదల అయిన సూపర్ కామెడీ అడ్వెంచర్ సినిమానే బ్యాచిలర్ పార్టీ. ప్రముఖ నటుడు రక్షిత్ శెట్టియే ఈ సినిమాను నిర్మించారు. స్టార్ హీరో నిర్మాణంలో వచ్చిన బ్యాచిలర్ పార్టీ సినిమాకు అభిజిత్ మహేష్ దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ఈ సినిమా ముగ్గురు యువకులు చుట్టూ తిరుగుతుంది. ఈ ముగ్గుర యువకుల పాత్రలో దిగంత్, అచ్యుత్ కుమార్, యోగేష్ కనిపించి మెప్పించారు. ఈ సూపర్ కామెడీ అడ్వెంచర్ సినిమాకు అర్జున్ రాము సంగీతం అందించారు.

అలాగే అరవింద్ ఎస్ సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఎడిటింగ్ బాధ్యతలను అభిషేక్ ఎం చేపట్టారు. ఇలా ఫుల్ ఫన్ తో పాటు థ్రిల్ ను ఇచ్చే సినిమాను సిద్ధం చేసి జనవరి 26వ తేదీన 2024లో థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. అనుకున్న స్థాయిలో బాక్సాఫీసు వద్ద భారీగా వసూళ్లు రాబట్టకపోయినా మంచి టాక్ యే తెచ్చుకుందీ చిత్రం. కథ బాగుండడం, అందులోనూ కామెడీ కూడా చక్కగా పండడంతో ఈ సినిమా కొందరికి బాగా కనెక్ట్ అయింది.
అయితే సినిమా థియేటర్లలో విడుదల అయి 40 రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ముఖ్యంగా సడెన్ గా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ను డేట్ ఫిక్స్ చేసి షాక్ ఇచ్చింది మూవీ టీం. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. మార్చి 4వ తేదీ అంటే రేపటి నుంచే ఈ సినిమా అందుబాటులోకి రాబోతుంది. అంటే ఈరోజు అర్థరాత్రి నుంచి ఈ సినిమాను ఓటీటీ వేధికగా చూసేయొచ్చు అన్నమాట.

కొత్త వారాన్ని కొత్తగా ఫుల్ ఫన్ అండ్ అడ్వెంచర్ ఫిల్మ్ తో స్టార్ చేస్తే.. మీకే మంచి కిక్ వస్తుంది. కాబట్టి రేపటి నుంచి ఈ చిత్రాన్ని ఓటీటీ వేధికగా ప్యామిలీతో కలిసి చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











