సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన కడుపుబ్బా నవ్వించే క్రేజీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
రోజురోజుకూ ఓటీటీల సందడి పెరిగిపోతుంది. ప్రతీ ఒక్కరూ టీవీలు చూడడానికి బదులుగా ఓటీటీల్లో తమకు నచ్చిన చిత్రాలు, వెబ్ సిరీస్ లు చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువగా హార్రర్, క్రైమ్, కామెడీ సినిమాలను ఓటీటీల వేదికగా చూస్తూ రచ్చ చేస్తున్నారు. తమ మాతృభాషలోనే కాకుండా ఇథర భాషల్లోనూ వచ్చిన హిట్ చిత్రాలను చూసేందుకు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ విషయం అర్థం చేసుకున్న మూవీ టీం.. అన్ని భాషల్లోనూ తమ చిత్రాలను అందుబాటులోకి తెస్తున్నారు. అయితే ఇప్పటికే ఓటీటీల్లో అనేక అదిరిపోయే కామెడీ చిత్రాలు ఉండగా.. తాజాగా మరో క్రేజీ కామెడీ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఆ సినిమా ఏంటో, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హిందీలో వచ్చిన రీసెంట్ కామెడీ డ్రామా చిత్రమే మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్. నటుడు కునాల్ ఖేము దర్శకత్వం వహించి, నటించిన ఈ సినిమాను ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఫర్హాన్ అక్తర్ మరియు రితేష్ సిధ్వానీ నిర్మించారు. ఇందులో దివ్యేందు, ప్రతీక్ గాంధీ, అవినాష్ తివారీ, నోరా ఫతేహి, ఉపేంద్ర లిమాయే, ఛాయా కదమ్‌ల ప్రధాన పాత్రల పోషించారు. మార్చి 22వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్న ఈ క్రేజీ మూవీని రూ.30 కోట్లలో నిర్మించారు. అయితే బాక్సాపీసు వద్ద ఈ చిత్రం రూ. 40 కోట్లు వసూలు చేసి హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే చిన్ననాటి స్నేహితులు ముగ్గురు కలిసి గోవా పర్యటన కోసం వెళ్తుండగా.. ఏం జరిగింది, వాళ్లు గోవాకు వెళ్లారా లేదా అనే అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చిందీ క్రేజీ చిత్రం. థియేటర్ల వద్ద ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో సఫలం అయిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతుంది. అలా అని అంతా చూడొచ్చు అనుకుంటున్నారేమో.. అదేం కుదరదండి. ఈ సినిమాను కేవలం రెంటల్ విధానంలో మాత్రమే చూడొచ్చు. ఈ మధ్య అమెజాన్ ప్రైమ్ వీడియో.. ముందుగా అన్ని సినిమాలను రెంటల్ విధానంలో తీసుకు వస్తూ.. ఆ తర్వాత కొంత కాలానికి ఫ్రీగా స్ట్రీమింగ్ చేస్తోంది. అయితే ప్రస్తుతం రెంటల్ విధానంలో అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని మే 17వ తేదీ నుంచి ఫ్రీగా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. డబ్బులు పెట్టడం ఇష్టం లేని వారు 17వ తేదీ వరకు ఆగి చూడాల్సిందే. లేదనుకుంటే రెంటల్ విధానంలో ఇప్పుడే చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











