OTTలోకి అదిరిపోయే కామెడీ సినిమా.. కడుపుబ్బా నవ్వాలంటే కచ్చితంగా చూడాల్సిందే!
మొన్నటి వరకు హార్రర్, థ్రిల్లర్ చిత్రాలు ఓటీటీలో సందడి చేయగా.. ఇప్పుడు కామెడీ చిత్రాల హవా పెరిగిపోయింది. ఇప్పటికే ఓటీటీలో మూడు సూపర్ డూపర్ హిట్ కామెడీ చిత్రాలు విడుదల అయి సెన్సేషన్ క్రియేట్ చేస్తుండగా.. నేరు మరో క్రేజీ కామెడీ ఎంటర్ టైనర్ ఓటీటీలోకి వచ్చింది. అయితే కడుపుబ్బా నవ్వుకోవాలనుకున్నా, ఫ్యామిలీతో కలిసి కాసేపు ఎంజాయ్ చేయాలనుకున్నా ఈ సినిమా కచ్చితంగా చూడాల్సిందే. మరి ఈ సినిమా ఏంటి, ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, రియా సుమన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన రీసెంట్ కామెడీ ఎంటర్ టైనర్ కిస్మత్ గురించి అందరికీ తెలిసిందే. అయితే అదిరిపోయే కామెడీ చేస్తూ వచ్చిన ఈ సినిమాలో అజయ్ ఘోష్, శ్రీనివాస్ అవసరాల, చమ్మక్ చంద్ర, యూట్యూబర్ గంగవ్వ, రచ్చ రవి, విశ్వదేవ్, సతీష్ సరిపల్లి వంటి వాళ్లు కూడా కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

ముఖ్యంగా కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజు నిర్మించిన ఈ సినిమాకు శ్రీనాథ్ బాదినేని దర్శకత్వం వహించారు. అలాగే మార్క్ కె రాబిన్ సంగీతం అందించగా... వేదరామన్ శంకరన్ సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే విప్లవ్ నైషధం ఎడిటర్ గా పని చేశారు. అయితే ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా... అనుకున్న స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది.
అలా థియేటర్లలో నుంచి త్వరగానే బయటకు వచ్చేసింది. ఇక ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎవరూ మాట్లాడలేదు. కానీ చడీ చప్పుడు లేకుండా.. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. కడుపుబ్బా నవ్వించే కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా సడెన్ గా ఓటీటీలోకి రావడంతో అంతా ఎగ్జైట్ అవుతున్నారు.

ముఖ్యంగా బీటెక్ చేసిన ముగ్గురు కుర్రాళ్లు.. ఉద్యోగం కోసం హైదరాబాద్ రావడం, అక్కడ అనేక పనులు చేస్తూ జీవితాలను నెట్టుకు రావడం ఈ సినిమాలో చూపిస్తారు. ముఖ్యంగా కూలీలుగా రాజకీయ పార్టీ తరఫును ప్రచారానికి వెళ్లడం.. ఈ ముగ్గురుకి 20 కోట్లు దొరకడం, ఓ రాజకీయ నాయకుడి వద్ద నుంచి 20 కోట్లు మాయం అవడం చూపిస్తారు. పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ అవసరాల పూర్తి వివరాలు కనుక్కోవడమే ఈ సినిమా అసలు కథ. ఆద్యంతం ఆకట్టుకునే ఈ స్టోరీని మీరు కూడా ఓసారి చూసేయండి.


Click it and Unblock the Notifications











