OTTలోకి వచ్చేసిన రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. వెన్నులో వణుకుపుట్టించే దీన్ని ఎక్కడ చూడాలంటే?

ఈ మధ్య కాలంలో అనేక కొత్త సినిమాలు ఓటీటీలోకి వస్తూ తెగ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా కొత్త వారం వచ్చిందంటే చాలు.. థియేటర్లలోకి వచ్చి నెల కూడా కాకముందే ఓటీటీలోకి వస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ సినిమాలను చూసేందుకు ఓటీటీ ప్రియులు కూడా తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు సరికొత్త చిత్రాలు వస్తాయా అని సోషల్ మీడియాలో వేదికగా అన్నింటినీ ఫాలో అవుతున్నారు. అయితే ఇటీవలే థియేటర్లలో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీయే కలియుగ పట్టణంలో. విశ్వ కార్తికేయ, అనీష్ కురువిల్ల, రూప లక్ష్మీలు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించిన ఈ సినిమాలో ఆయుషి పటేల్, దేవి ప్రసాద్, నారాయణ్ రామా, చిత్ర శుక్లా వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆ ధ్వరయ్ంలో కందుల గ్రూప్ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి. మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు.

Recent Crime Thriller Kaliyuga Pattanamlo Movie OTT Streaming Details Here

అద్భుతమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను మార్చి 29వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. అయితే అనుకున్న స్థాయిలో బాక్సాఫీసు వద్ద హిట్టు కొట్టలేకపోయిందీ చిత్రం. కానీ చూసిన వాళ్లంతా ఈ సినిమా చాలా బాగుందని.. కచ్చితంగా ప్రతీ ఒక్కరూ చూడాల్సిన చిత్రం అంటూ చెప్పుకొచ్చారు. థియేటర్లలోకి వచ్చి అతి త్వరగా వెళ్లిపోయిన కలియుగ పట్టణంలో సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే భారీ పోటీ నడుమ ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది.

Recent Crime Thriller Kaliyuga Pattanamlo Movie OTT Streaming Details Here

ముఖ్యంగా ఈ సినిమాను మే 23వ తేదీ అంటే ఈరోజు నుంచే ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఆ ప్రకారమే ఈ క్రేజీ మూవీని నేరుగా ఈరోజు నుంటి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ చేస్తున్నారు. అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సూపర్ మూవీని ఇంట్లోనే కూర్చుని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. ముఖ్యంగా క్రైమ్, థ్రిల్లర్ సినిమాలు ఇష్ట పడే ప్రతీ ఒక్కరూ ఈ క్రేజీ మూవీని కచ్చితంగా చూసేయండి. డోంట్ మిస్ ఇట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X