OTT : రీసెంట్ డిజాస్టర్ సీక్వెల్ .. ఓటిటిలో వచ్చేస్తుందా? ఎప్పుడు ఏ ఓటిటిలో అంటే?

2024లో వచ్చిన ఎన్నో చిత్రాల్లో పలు క్రేజీ సీక్వెల్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రాల్లో మన దక్షిణాది నుంచి కూడా చాలానే మోస్ట్ అవైటెడ్ సినిమాలు ఉన్నాయి. ఇక ఈ డిసెంబర్‌లోనే చూసుకుంటే సౌత్ ఇండస్ట్రీ నుంచి రెండు క్రేజీ సీక్వెల్ చిత్రాలు రిలీజ్‌కి వచ్చాయి.

ఈ చిత్రాలే తెలుగు నుంచి బిగ్గెస్ట్ పాన్ ఇండియా అవైటెడ్ సీక్వెల్ సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ చిత్రం పుష్ప 2. మరో చిత్రం తమిళ్ నుంచి వచ్చిన విడుదలై పార్ట్ 2. ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటిస్తే ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వం వహించారు.

recent flop sequel viduthalai 2 ott date got locked here is when

పాన్ ఇండియా లెవెల్లో పుష్ప 2 మంచి హైప్ ఉన్న సీక్వెల్ అయితే తమిళ్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సీక్వెల్ సినిమా విడుదలై పార్ట్ 2. కాగా ఈ సినిమా మాత్రం తమిళ్ లో సహా తెలుగులో కూడా మొదటి భాగం వచ్చి మంచి హిట్ అయ్యింది. అయితే పార్ట్ 2ని బాగా లేట్ చేస్తూ తీసుకొచ్చారు. కానీ ఎట్టకేలకి తెలుగులో కూడా విడుదల 2 గా తీసుకొచ్చారు.

కానీ ఈ సీక్వెల్ మాత్రం ఇటు తెలుగులో అటు తమిళ్ లో కూడా మొదటి పార్ట్ రేంజ్ లో హిట్ అవ్వలేదు. దీనితో ఇది డిజాస్టర్ గానే మిగిలిపోయింది. ఇదిలా ఉండగా ఇపుడు ఈ ప్లాప్ సినిమా ఓటిటి డేట్‌ని లాక్ చేసేసుకున్నట్టుగా సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ జనవరి 17 నుంచి ఇది ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేస్తుందట. అన్నట్టు ఈ సినిమా ఓటిటి హక్కులని ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ జీ 5 సొంతం చేసుకోగా అందులో ఈ జనవరి 17 నుంచి రావచ్చని తెలుస్తుంది.

recent flop sequel viduthalai 2 ott date got locked here is when

దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ ఏడాదిలో విజయ్ సేతుపతి నుంచి వచ్చిన రెండో సినిమా ఇది. కాగా మహారాజ తో భారీ హిట్ అందుకొని దీనితో కూడా కంటిన్యూ చేద్దాం అనుకున్నారు విజయ్. కానీ ఈ సినిమా అంచనాలు అందుకోలేక చతికిల పడింది. ఇక మొదటి భాగంలో ప్రముఖ కమెడియన్ సూరి ప్రధాన పాత్రలో నటిస్తే పార్ట్ 2 లో తనని నామమాత్రం గానే చూపించడం గమనార్హం.

ఈ సినిమాకి దిగ్గజ సంగీత దర్శకులు ఇళయరాజా స్వరాలు సమకూర్చగా గౌతమ్ మీనన్, సార్ ఫేమ్ యువ నటుడు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే రీసెంట్ జైలర్ నటి మంజు వారియర్ విజయ్ సేతుపతి సరసన నటించింది. వెట్రిమారన్ ఈ సినిమాకి దర్శకత్వమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. అలాగే ఎల్రెడ్ కుమార్ నిర్మాణ బాధ్యతలు చూశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X