ఓటీటీలోకి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే కామెడీ వెబ్ సిరీస్.. కచ్చితంగా అక్కడ చూసేయండి!
ఈ మధ్య కాలంలో ఓటీటీల జోరు ఎక్కువ అవుతోంది. నిన్న, మొన్నటి వరకు టీవీలూ చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన వారంతా ప్రస్తుతం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా టీవీలు, సీరియల్స్ కంటే ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్ లు ఆసక్తికరంగా ఉంటుండడంతో.. వాటిని అర్థం చేసుకున్న చాలా మంది దర్శక, నిర్మాతలు సరికొత్త కథలతో వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తూ సక్సెస్ సాధిస్తున్నారు. అయితే ఇలాంటి ఓ ఆలోచనతోనే వచ్చిన ఈ క్రేజీ వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. మరి ఆ సిరీస్ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అద్భుతమైన కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన రీసెంట్ తమిళ వెబ్ సిరీస్ యే.. ఉప్పు పులి కారం. దీపికా వెంకటాచలం, వనితా క్రిష్టాచంద్రన్, అయేషా జీనాథ్, నవీన్ కుమార్, రాజ్ అయ్యప్ప, అశ్విని ఆనందిత, పొన్వన్నన్, ఎమ్. ఫరీనా ఆజాద్, కృష్ణ, దీపక్ పరమేష్ లు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఓ జంటకు లుగు పిల్లలు ఉన్న ఈ వెబ్ సిరీస్.. ప్రతీ ఒక్కరి గుండెను మెలిపెడుతుంది. ఈ అద్భుతమైన కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వెబ్ సిరీస్ ను ఎమ్ రమేష్ భారతి, వికటన్ టెలివిస్టాస్ నిర్మించారు.

'ఉప్పు పులి కారం' వెబ్ సిరీస్ కు షేక్ సంగీతం అందించగా.. పార్తిబన్, సతీష్ కుమార్ సినిమాటోగ్రఫర్ గా పని చేశారు. అయితే ఈ క్రేజీ వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా మే 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థే ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది.

పొట్ చెక్కలయ్యేలా నవ్వించేందుకు సిద్ధం అవుతున్న ఈ వెబ్ సిరీస్ ను ప్రతీ ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిందే. ఎవరు మిస్ అయినా ఎంతో మిస్ అయినట్లే. ఎందుకంటే ఈ మధ్య అడల్డ్ కామెడీ లేకుండా... ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ లు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి హెల్తీ కామెడీతో రాబోయే సినిమాలను మీరు కూడా ఓసారి చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











