OTTలోకి వచ్చేసిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫాంటసీ థ్రిల్లర్.. మొత్తం 7 భాషల్లో.. ఎక్కడ చూడాలంటే?

ఆ మధ్య కాలంలో అనేక అదిరిపోయే సినిమాలు ఓటీటీల వేదికగా త్వరగా వచ్చేస్తూ.. ఓటీటీ ప్రియులను తెగ అలరిస్తున్నాయి. పెద్ద పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలు కూడా త్వరగానే ఓటీటీలోకి వచ్చేస్తుండగా.. ఎక్కువగా థియేటర్లకు వెళ్లడం మానేశారు జనాలు. ముఖ్యంగా సమ్మర్ కావడం.. అందులోనూ అంతా ఇంట్లోనే కూర్చోవడంతో... ఎక్కువగా సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇటీవలే హాలీవుడ్ లో వచ్చిన ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

డీసీ కామిస్క్స్ ఆధారంగా వచ్చిన రీసెంట్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీయే ఆక్వామెన్ 2. DC స్టూడియోస్, అటామిక్ మాన్‌స్టర్, సఫ్రాన్ కంపెనీ, డొమైన్ ఎంటర్‌టైన్‌మెంట్‌లచే నిర్మించబడిన ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ద్వారా పంపిణీ చేశారు. అయితే ఈ సినిమా DC ఎక్స్‌టెండెడ్ యూనివర్స్‌లో 15వ మరియు చివరి చిత్రం. జేమ్స్ వాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాసన్ మోమోవా ఆర్థర్ కర్రీ / ఆక్వామాన్‌గా నటించారు. అలాగే అంబర్ హర్డ్, రాండాల్ పార్క్, డాల్ఫ్ లండ్‌గ్రెన్, టెమ్యురా మారిసన్, మార్టిన్ షార్ట్, నికోల్ కిడ్‌మాన్ కూడా సహాయక పాత్రల్లో నటించి మెప్పించారు.

Recent Hollywood Block Buster Hit Movie Aquamen 2 OTT Streaming Details Here

భారీ హంగులతో నిర్మించిన ఈ క్రేజీ మూవీని 2023 డిసెంబర్ 22వ తేదీన అమెరికాలో గ్రాండ్ గా విడుదల చేశారు. మొదటి నుంచి పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీగానే వసూళ్లు చేసింది. ముఖ్యంగా 434.4 మిలయన్ డాలర్లు వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంత పెద్ద హిట్ గా నిలిచిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ఈ సినిమా మొత్తం 7 భాషల్లో అందుబాటులో నిలిచింది.

Recent Hollywood Block Buster Hit Movie Aquamen 2 OTT Streaming Details Here

ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జియో సినిమా వేదికగా మే 21వ తేదీ అంటే ఈరోజు నుంచే ఆక్వామెన్ 2 స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కన్నడ, బెంగాళీ, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. మొత్తం 7 భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సినిమాను అందరూ చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి కూర్చుని మరీ ఈ క్రేజీ మూవీని ఎంజాయ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం వెళ్లండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X