నేరుగా ఓటీటీలోకి కడుపుబ్బా నవ్వించే రొమాంటిక్ కామెడీ మూవీ.. ఈ ఫ్యామిలీ ఎఫైర్‌ను ఎలా చూడాలంటే?
ఈ మధ్య ఎక్కువగా హార్రర్, థ్రిల్ల, క్రైమ్ స్టోరీలతో పాటు కామెడీ చిత్రాలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎక్కువ మంది సినీ ప్రియులు ఇలాంటి వాటినే ఇష్ట పడుతుండడంతో.. అలాంటి చిత్రాలోనే తీసుకు వస్తున్నారు దర్శక, నిర్మాతలు. ఇప్పటికే ఓటీటీలో అనేక కామెడీ, రొమాంటిక్ చిత్రాలు ఉండగా.. ఇప్పుడు మరో క్రేజీ కామెడీ రొమాంటిక్ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. అయితే ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హాలీవుడ్ లో రీసెంట్ గా వచ్చిన రొమాంటిక్ కామెడీ మూవీయే ఎ ఫ్యామిలీ అఫైర్. రిచర్డ్ లాగ్రావెనీస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు క్యారీ సోలమన్ కథను అందించారు. అద్భుతమైన అమెరికన్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో నికోల్ కిడ్‌మాన్, జాక్ ఎఫ్రాన్, జోయి కింగ్, లిజా కోషి, కాథీ బేట్స్, షిర్లీ మెక్‌లైన్ లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. అద్భుతమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది.

ముఖ్యంగా ఈ క్రేజీ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని గతేడాది నవంబర్ 17వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ అప్పుడు వీలు పడలేదు. అలా వాయిదా పడిన ఈ చిత్రాన్ని జూన్ 28వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. ఇదే తేదీని ఫిక్స్ కూడా చేసుకున్నారు. ఇప్పటికీ చాలా ఆలస్యం అయిందని భావించిన చిత్ర బృందం నేరుగా ఈ మూవీని ఓటీటీలోకి తీసుకు వచ్చారు. మే 28వ తేదీ నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.
నిన్నటి నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను చూడాలని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓ యువతి పని చేస్తున్న యజమాని.. తన తల్లితో ప్రేమలో పడతాడు. ఆ విషయం తెలుసుకున్న యువతి ఏం చేసింది, అతడి వద్దే పని చేసింది, మానేసిందా... ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంది అనే కాన్సెప్ట్ తో వచ్చిందీ సినిమా. ఇంత అద్భుతమైన కామెడీ చిత్రంగా తెరకెక్కిన దీన్ని కచ్చితంగా ఓటీటీ వేదికగా ఇంట్లోనే కూర్చుని చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. డోంట్ మిస్ ఇట్.


Click it and Unblock the Notifications











