OTTలోకి క్రేజీ థ్రిల్లర్ వార్ మూవీ.. బాక్సాఫీసు బద్ధలు చేసిన ఈ మూవీని ఎలా చూడాలంటే?

ఈ మధ్య కాలంలో హాలీవుడ్ సినిమాలను ఇష్ట పడే వారి సంథ్య మరింత ఎక్కువ అయింది. హాలీవుడ్ అనే కాకుండా.. ఏ భాషలో వచ్చినా వాటికి సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చాలా మంది చూసేస్తున్నారు. అలా చూడలేని వారి కోసం అనేక మంది దర్శక, నిర్మాతలతో ఒక బాషలో వచ్చిన చిత్రాన్ని వీలైనంత ఎక్కువ భాషల్లో అందుబాటులోకి తెస్తున్నారు.

ఇలా చేస్తుండడంతో ఓటీటీ ప్రియులు కూడా తమకు నచ్చిన చిత్రాన్ని చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఓటీటీలో అనేక క్రేజీ చిత్రాలు ఉండగా.. ప్రస్తుతం మరో థ్రిల్లర్ వార్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఆ సినిమా ఏంటి, దాన్ని ఎక్కడ చూడాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Recent Hollywood War Thriller Movie The Last Rifleman OTT Details Here

అత్యంత ప్రతిష్టాత్మకంగా హాలీవుడ్ లో తెరకెక్కిన క్రేజీ మూవీయే ది లాస్ట్ రైఫిల్‌మ్యాన్. 2023లో కెవిన్ ఫిట్జ్‌ప్యాట్రిక్ రాసిన బ్రిటిష్ డ్రామా సినిమా ఇది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు డైరెక్టర్ టెర్రీ లోన్. ఈ క్రేజీ మూవీలో పియర్స్ బ్రాస్నన్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. ఉత్తర ఐరిష్ రెండో ప్రపంచ యుద్ధంలో ఎంతో అనుభవం కలవాడైన ఆర్టీ క్రాఫోర్డ్ జీవిత కథ అధారంగా ఈ సినిమాను రూపొందించారు.

ముఖ్యంగా అతను నార్మాండీలో డి-డే ల్యాండింగ్‌ల 75వ వార్షికోత్సవం సందర్భంగా.. తన ఇంటి తప్పించుకోవాలనుకుంటాడు. అలాగే ఉత్తర ఐర్లాండ్ నుండి ఫ్రాన్స్‌కు వెళ్లే క్రమంలో ఆయన ఎదుర్కున్న సమస్యలను కళ్లకు కట్టినట్లు ఈ చిత్రంలో వివరించారు. అయితే ఈ క్రేజీ మూవీ గతేడాది నవంబర్ 5వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది.

Recent Hollywood War Thriller Movie The Last Rifleman OTT Details Here

బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమాకు స్టీఫఎన్ వార్ బెక్ సంగీతం అందించారు. అలాగే కాటీ జాక్సన్, జాన్ లెస్లీ, కెవిన్ జాక్సన్ లు ఈ సినిమాను నిర్మించారు. బాక్సాఫీసును షేక్ చేసిన సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జియో సినిమా వేదికగా.. మే 31వ తేదీ నుంచి ది లాస్ట్ రైఫిల్ మ్యాన్ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ క్రేజీ వార్ థ్రిల్లర్ చిత్రాన్ని ఓటీటీ ప్రియులంతా... ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి కూర్చుని మరీ చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X